Covid-19 UPdate : దేశంలో నిన్న కొత్తగా 2,075 కోవిడ్ కేసులు నమోదు

దేశంలో నిన్న కొత్తగా 2,075   కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 71మంది కోవిడ్ సంబంధిత కారణాలతో మృత్యువాత పడ్డారు.

India Covid Up Date

Covid-19 UPdate : దేశంలో నిన్న కొత్తగా 2,075   కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 71మంది కోవిడ్ సంబంధిత కారణాలతో మృత్యువాత పడ్డారు. దీంతో కోవిడ్ బారిన పడిన  వారి సంఖ్య 4,30,04,005కు చేరగా, కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5,16,352కు చేరింది.

ఇంతవరకు 4,24,61,926 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 27,802 యాక్టివ్ కేసులు ఉన్నాయి. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 3,383 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
Also Read : China Covid-19 Deaths : చైనాలో కరోనా విలయం.. 2ఏళ్ల తర్వాత మొదలైన కరోనా మరణాలు..!
దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.72 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. రోజువారి పాజిటివిటీ రేటు 0.35 శాతంగా ఉన్నదని కేంద్ర వెల్లడించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్త కోవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా శనివారం మధ్యాహ్నం 11 గంటలవరకు 180,98,38,584 మందికి వ్యాక్సిన్ వేశారు.