india corona cases
India Corona Cases : భారత్ లో కొత్తగా 3011 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసులు 4,45,97,498కి చేరాయి. వీటిలో 4,40,32,671 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,701 మంది కరోనాతో మరణించారు. మరో 36,126 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో కరోనాతో 28 మంది మరణించగా, 4301 మంది వైరస్ నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.08 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.73 శాతంగా ఉందని పేర్కొంది.
Telangana Covid News : తెలంగాణలో అదుపులోనే కరోనా వ్యాప్తి.. కొత్తగా ఎన్ని కేసులంటే..
మరణాలు 1.2 శాతం ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 218.77 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఇందులో 94.87 కోట్ల మంది రెండో డోసు తీసుకోగా, 21.41 కోట్ల మంది ప్రికాషనరీ డోసు వేయించుకున్నారని పేర్కొంది.