Omicron Variant In India: దేశంలో పెరిగిన కరోనా కేసులు.. టెన్షన్ పెట్టేస్తున్న ఒమిక్రాన్!

ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ రాగా దేశంలో మూడో వేవ్ వస్తుందేమో అనే టెన్షన్ కనిపిస్తుంది.

Omicron Variant In India: ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ రాగా దేశంలో మూడో వేవ్ వస్తుందేమో అనే టెన్షన్ కనిపిస్తుంది. దేశంలో కొత్తగా 7వేల 447 కరోనా కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో 391మంది మరణించారు. ఇదే సమయంలో 7,886 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దేశంలో 86,415 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 3,41,62,765 మంది కోవిడ్‌ను జయించారు.

కాగా, దేశంలో ఇప్పటి వరకు 4,76,869 మంది కరోనా కారణంగా మరణించారు. దేశంలో ఇప్పటివరకు 3,47,26,049 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు 68కి చేరుకున్నాయి. భారత్‌లోనూ ఒమిక్రాన్‌ వేరియంట్ చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది.

గతంలో బయటపడ్డ డెల్టా వేరియంట్‌ కంటే వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 88కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 9 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వైరస్ విస్తరించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 32 కేసులు నమోదవగా.. రాజస్థాన్ లో 17, తెలంగాణలో 7, ఏపీలో ఒక ఒమిక్రాన్ కేసులను నిర్ధారించారు

దేశంలో యాక్టివ్ కేసుల శాతం 0.25గా ఉంది. దేశంలో రికవరీ రేటు 98.38 శాతంగా ఉంది. దేశంలో మార్చి 2020 తరువాత రికవరీ కేసుల శాతం భారీగా పెరిగింది. భారత్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు 66.15 కోట్లు దాటాయి.

ట్రెండింగ్ వార్తలు