BrahMos Supersonic Missile: విజయవంతంగా ముగిసిన బ్రహ్మోస్ ప్రయోగం

బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతంగా పూర్తి అయింది. ఇండియన్ నేవీ డిస్ట్రాయర్ ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నుంచి పశ్చిమ తీరంలో పరీక్షించారు.

BrahMos supersonic missile: బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతంగా పూర్తి అయింది. ఇండియన్ నేవీ డిస్ట్రాయర్ ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నుంచి పశ్చిమ తీరంలో పరీక్షించారు. క్షిపణి సముద్రం నుంచి సముద్రం వేరియంట్‌ను గరిష్ట రేంజ్‌లో పరీక్షించగా నిర్ధిష్టమైన, ఖచ్చితత్వంతో టార్గెట్ షిప్‌ను ఢీకొట్టింది. డీఆర్డీఓ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్వీట్ చేసింది.

బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిస్ మిస్సైల్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇండియన్ నేవీ సంతోషాన్ని వ్యక్తం చేసింది. చైనా, పాక్‌లతో సరిహద్దుల్లో నిరంతరం ఉద్రిక్తత నెలకొన్న సమయంలో భారత్ ఈ పరీక్ష చేయడం విశేషం.

డిసెంబరు 8న, సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఎయిర్ టు ఎయిర్ వేరియంట్‌ను ఒడిశా తీరంలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) వర్గాలు ఈ సమాచారాన్ని అందించాయి.

ట్రెండింగ్ వార్తలు