హైప‌ర్‌సోనిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం.. అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన భారత్

భారత్ తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. తద్వారా దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణులున్న దేశాల జాబితాలో భారత్ చేరింది.

long range hypersonic missile

Hypersonic Missile : భారత్ తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. తద్వారా దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణులున్న దేశాల జాబితాలో భారత్ చేరింది. ఆదివారం ఉదయం ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ఐలాండ్ లో ఈ క్షిపణి పరీక్ష జరిగింది. ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగంకు సంబంధించిన వీడియోను రక్షణ శాఖ ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఈ చారిత్రక ఘట్టంలో అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీని సాధించిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చేరినట్లయిందని పేర్కొంది.

Also Read: Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై బాబుల దాడి .. వీడియో వైరల్

1500 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ఛేదించగలదు. వివిధ రకాల వార్ హెడ్ లను అమర్చేలా దీనిని డిజైన్ చేశారు. ఈ పరీక్ష సమయంలో క్షిపణి గమనాన్ని వివిధ వేదికల నుంచి జాగ్రత్తగా ట్రాక్ చేశారు. చివరి దశలో అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఢీకొన్నట్లు డీఆర్డీవో వెల్లడించింది. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ‘ఎక్స్’ ఖాతాలో స్పందించారు. దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణి విజయవంతం పట్ల బృందాన్ని అభించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారతదేశం ప్రధాన మైలురాయిని సాధించిందని అన్నారు. ఇది ఒక చారిత్రాత్మక క్షణం. ఈ ముఖ్యమైన విజయం మన దేశాన్ని అధునాతన మిలిటరీ సాంకేతికతలను కలిగి ఉన్న దేశాల సమూహంలో చేర్చిందని చెప్పారు.