Covid-19 Origins : కరోనా మూలాలపై దర్యాప్తుకు భారత్ మద్దతు

కరోనా వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి లోతైన దర్యాప్తు చేపట్టాలన్న వివిధ దేశాల డిమాండ్ కు భారత్ మద్దతు తెలిపింది.

India Supports Whos Covid 19 Origins Study

Covid-19 Origins కరోనా వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి లోతైన దర్యాప్తు చేపట్టాలన్న వివిధ దేశాల డిమాండ్ కు భారత్ మద్దతు తెలిపింది. ఈ ఏడాది మార్చిలో WHO చైనాలో పర్యటించి దర్యాప్తు చేపట్టినా..అమెరికా సహా పలు దేశాలకు సంస్థ అందించిన నివేదికపై సంతృప్తి చెందలేదు. ఈ నేపథ్యంలో పలు దేశాలు WHO మరోసారి కరోనా మూలాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్​ చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ కు కూడా వివిధ దేశాల డిమాండ్ కు మద్దతు తెలిపింది.ఈ మేరకు భారత విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

విదేశాంగశాఖ విడుదల చేసిన ప్రకటనలో…కోవిడ్-19 మూలం గురించి WHO అధ్యయనం ఒక ముఖ్యమైన మొదటి దశ. మరింత డేటా మరియు అధ్యయనాలు బలమైన ముగింపు(Conclusion)కి రావడానికి తరువాతి దశ అధ్యయనాల అవసరాన్ని ఇది నొక్కి చెబుతోంది. WHO దర్యాప్తునకు అన్ని దేశాల సహకారం ఉండాలని విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందమ్​ బాగ్చీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

మరోవైపు, కరోనా వైరస్ మూలాలను తెలుసుకోవడానికి అమెరికా నిఘా సంస్థలు తమ ప్రయత్నాలను “రెట్టింపు” చేయాలని యూఎస్ అధ్యక్షుడు జో బెడెన్ బుధవారం ప్రకటించారు. కరోనా వైరస్ మూలాలపై 90 రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని అమెరికా ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీని జో బైడెన్ ఆదేశించారు. దర్యాప్తుకు సహకరించాలని అమెరికా నేషనల్‌ ల్యాబోరేటరీస్‌కు బైడెన్‌ విజ్ఞప్తి చేశారు. వైరస్‌ మూలాలను కనుక్కునేందుకు చైనా సైతం కలిసిరావాలని కోరారు.