India Rainfall : ఈ ఏడాది వర్షాలపై ఐఎండీ గుడ్ న్యూస్

ఈ ఏడాది వర్షాలపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తీపి కబురు చెప్పింది. ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమైనా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.

India Rainfall : ఈ ఏడాది వర్షాలపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తీపి కబురు చెప్పింది. ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమైనా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలతో 101 శాతం వర్షాలు కురుస్తాయని చెప్పింది. మధ్య భారతంలో వర్షపాతం సాధారణం కన్నా అధికంగా ఉండొచ్చని అంచనా వేసింది.

ఉత్తర, దక్షిణ భారతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని చెప్పింది. ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షాలు కురుస్తాయంది. వాయవ్య భారతంలోనూ సాధారణ వర్షాలు కురుస్తాయంది. పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోని నీటి ఉపరితల ఉష్ణోగ్రతల ప్రభావం భారత్ లో వానాకాలంపై ఉంటుందని, ఈ నేపథ్యంలోనే అక్కడి ఉష్ణోగ్రతల్లోని మార్పులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వాతావరణ శాఖ చెప్పింది. నైరుతి రుతుపవనాల రాక రెండు రోజులు ఆలస్యం కానుందని, జూన్ 3న కేరళ తీరాన్ని తాకే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది.

వానలు సమృద్ధిగా కురిస్తేనే తాగునీటి కొరత తీరుతుంది. వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. పలు ప్రాంతాల్లో వానల మీద ఆధారపడే అన్నదాతలు వ్యవసాయం చేస్తున్నారు. సమయానికి వర్షం పడకపోతే ఇబ్బందులు తప్పవు. తాగునీటి కొరతే కాదు ఆహార ధాన్యాల కొరత కూడా ఏర్పడుతుంది. అందుకే వానలు సమృద్దిగా కురవాలని అంతా కోరుకుంటారు.

ట్రెండింగ్ వార్తలు