చైనాను దాటేంశాం: న్యూ ఇయర్ రోజున ఇండియాలోనే పిల్లలు ఎక్కువగా పుట్టారు

  • Publish Date - January 2, 2020 / 05:29 AM IST

కొత్త సంవత్సరమంటే ప్రతి ఒక్కరిలోనూ కొత్త ఉత్సాహం వస్తుంది. మారుతున్న కాలంలో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు అర్థరాత్రి వరకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం అంటే అదో అరుదైన సంధర్భం.. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం అంటే.. గడిచిపోయిన జ్ఞాపకాలు.. చేయవలిసిన పనులకు ప్రణాళికలు వేసుకోవలసిన టైమ్.. 

అటువంటి టైమ్‌లో భూమి మీదకు అడుగుపెట్టిన శిశువులు జీవితం అంటే ఇంకెలా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పిల్లలు ఆరోజు పుట్టారు అనే విషయాన్ని లెక్కలు వేస్తుంది యూనిసెఫ్(యుఎన్ చిల్డ్రన్ ఏజెన్సీ). ప్రపంచవ్యాప్తంగా 2020లో నాలుగు లక్షల దగ్గరగా పిల్లలు పుట్టినట్లుగా యూనీసెఫ్ గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా భారత్‌లో జనవరి ఒకటవ తేదీన 67,385మంది పుట్టినట్లుగా యూనిసెఫ్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 392,078 మంది పిల్లలు జన్మించగా అందులో 67,385 మంది శిశువులు భారతదేశంలో పుట్టారు. 46,299మంది శిశువులతో చైనా రెండవ స్థానంలో నిలిచింది.

కొత్త సంవత్సరం మరియు కొత్త దశాబ్దం ప్రారంభం మన భవిష్యత్తు కోసం మాత్రమే కాకుండా, మన తరువాత వచ్చే వారి భవిష్యత్తు గురించి మన ఆశలు మరియు ఆకాంక్షలను ప్రతిబింబించే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో పుట్టిన వీరికి ప్రాముఖ్యత ఉంటుందని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోర్ వెల్లడించారు. ప్రతి జనవరిలో క్యాలెండర్ మారినప్పుడు వీళ్లకు కొత్తగా ప్రయాణం చేసే అవకాశం లభిస్తుందని యూనిసెఫ్ అభిప్రాయపడింది. 
 
2020లో పసిఫిక్‌లోని ఫిజీలో మొదటి బిడ్డను ప్రసవించగా, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం(67,385), చైనా (46,299), నైజీరియా (26,039), పాకిస్తాన్ (16,787), ఇండోనేషియా (13,020), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (10,452), డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (10,247) మరియు ఇథియోపియా(8,493). ప్రతి జనవరిలో యూనిసెఫ్ న్యూ ఇయర్ రోజున పుట్టిన శిశువులను లెక్కిస్తుంది. ఇది అరుదైన సంధర్భం కాబట్టి వారిని లెక్కిస్తుంది. వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తుంది.