శ్రీలంకలో బాంబ్ బ్లాస్టింగ్స్ : ఇండియన్ నేవీ హై అలర్ట్ 

  • Publish Date - April 22, 2019 / 10:44 AM IST

శ్రీలంక బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిపోయింది. దీంతో భారత  భారతీయ కోస్ట్ గార్డ్ సముద్ర సరిహద్దు వెంట భద్రతను కట్టుదిట్టం చేసింది. శ్రీలంక, భారత్ సముద్ర సరిహద్దుల్లో హై అలర్ట్ ను ప్రకటించినట్టు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. 
 

స్థానిక ఇస్లామిక్- నేషనల్ థౌహెత్ జమా’త్ – ఈస్టర్ ఆదివారం (ఏప్రిల్ 21)న బాంబు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడులలో 300 మంది ప్రాణాలు కోల్పోయారు.  దాడి జరిగిన అంతరం సముద్ర మార్గం గుండా ఉగ్రవాదులు తప్పించుకోవటానికి యత్నిస్తారు. శ్రీలంకకు భారత సరిహద్దు ప్రాంతం కాబట్టి భారత్ లోకి కూడా ఉగ్రవాదులు ప్రవేశించే అవకాశమున్న క్రమంలో  కోస్టల్ గార్డ్ హై అలర్ట్ ప్రకటించింది. 

కాగా దాడులు జరిగిన అనంతరం శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల  శ్రీ సేన సోమవారం అర్ధరాత్రి నుండి దేశవ్యాప్త హై అలర్ట్ ప్రకటించారు. ఇటువంటి దాడులు మరెక్కడన్నా జరుగితే ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించించారు. ఈ క్రమంలో ప్రజలు ఇళ్లనుంచి రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  ఇది ప్రజల స్వేచ్ఛను హరించటం కాదనే విషయాన్ని ప్రజలు అర్థంచేసుకోవాలని మైత్రిపాల శ్రీసేన ప్రజలను కోరారు.