కొడుకు మృతి..కోడల్ని పెళ్లి చేసుకున్న మామ : అది తప్పు కాదట..!!

  • Publish Date - July 7, 2020 / 04:01 PM IST

కన్న కొడుకు చచ్చిపోయిన తండ్రి ఏం చేస్తాడు. కొడుకుని తలచుకుని ఏడుస్తాడు. చేతికి అంది వచ్చిన కొడుకుని పోగొట్టుకున్న ఏ తండ్రి అయినా అలాగే ఉంటాడు. కానీ ఓ తండ్రి మాత్రం కొడుకు చనిపోయాక కోడల్ని పెళ్లి చేసుకున్నాడు. వినటానికి ఇది వింతగా..విచిత్రంగా..ఏవగింపుగా ఉన్నా ఇది నిజం. ఇది ఎక్కడోకాదు మన దేశంలోనే. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన అక్కడ ఏమాత్రం తప్పు కాదట..! ఇటువంటివి అక్కడ సర్వసాధరణమేనట..! ఎందుకంటే అది అక్కడి సంప్రదాయటమట..!!

ఛత్తీస్‌గఢ్ లోని బిలాస్‌పూర్‌కు చెందిన గౌతమ్ సింగ్ అనే యువకుడు ఆర్తిసింగ్ అనే 18ఏళ్ల యువతని 2016లో పెళ్లి చేసుకున్నాడు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వారి కాపురంలో విషాదం నేనున్నానంది. గౌతమ్ సింగ్ మృతి చెందాడు. అతను చనిపోయి రెండేళ్లు అయ్యింది.

భర్త కోల్పోయినప్పటి నుంచీ ఆర్తిసింగ్ గత రెండు సంవత్సరాలుగా వితంతువుగా భర్త గౌతమ్ సింగ్ తండ్రి కృష్ణ రాజ్‌పుత్ సింగ్ ఇంట్లోనే ఉంటోంది. ‌ఈ క్రమంలో రాజ్‌పుత్ క్షత్రియ మహాసభ సంప్రదాయం ప్రకారం 22 ఏళ్ల కోడలు ఆర్తిసింగ్‌ను మామ కృష్ణ రాజ్‌పుత్ వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. దానికి పెద్దలు కూడా అంగీకరించారు.

వితంతువులుగా ఉండే మహిళలు మరోవివాహం చేసుకోవచ్చనే సంప్రదాయం కలిగిన ఆ ప్రాంతంలో సర్వసాధారణం. ఈక్రమంలో ఆర్తి సింగ్ కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంది. దీనికి తోడు రెండేళ్లుగా మామ తనను ఎంతో గౌరవంగా చూసుకున్న తీరు ఆర్తిసింగ్‌కు నచ్చింది. రాజ్‌పుత్ క్షత్రియ మహాసభ కమిటీ అధ్యక్షుడు హోరిసింగ్ దౌడ్ సమక్షంలో ఆ సంఘం ప్రతినిధులు రాజ్‌పుత్ సింగ్, ఆర్తిల వివాహం జరిపించారు.

ఈ పెళ్లిలో ఆత్మీయులతో బారాత్ కూడా జరిగింది. పెళ్లికొడుకు గుర్రంపై కత్తులు పట్టుకుని ఊగేతూ బారాత్ చేసుకున్నాడు. ఈ సంప్రదాయం వందల సంవత్సరాలుగా కొనసాగుతోందని పెళ్లి పెద్దలు తెలిపారు. సంస్కృతీ సంప్రదాయాలను అనుసరిస్తూ..భారత మహిళలకు గౌరవం ఇవ్వాలని వారు కోరారు.

కరోనా వైరస్ నిబంధనల ప్రకారం అతి తక్కువమంది అతిథులు హాజరుకాగా వివాహం జరిగింది. కాగా..ఇలాంటి వివాహాలు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో జరుగుతుంటాయి. ముఖ్యంగా గిరిజనుల్లో అన్న చనిపోతే వదినను తమ్ముడు వివాహం చేసుకుంటాడు. అలాగే తమ్ముడు చనిపోతే మరదలిని అన్న వివాహం చేసుకుంటాడు.

Read Here>>కరోనాతో గోవా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కన్నుమూత