Corona Update
Corona Update : దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. గత వారం 41,42 వేల మధ్య నమోదైన కరోనా కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం దేశంలో 44,643 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 464 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఇక ఇదే క్రమంలో మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. కేరళ రాష్ట్రంలోనే కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఒక్క కేరళ నుంచే సగానికి పైగా కేసులు వస్తున్నాయి.
ఇక గడిచిన 24 గంటల్లో 42,096 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,14,159 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కేరళలో అధికంగా ఉంది.
1.8 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలోని యాక్టివ్ కేసుల్లో 40 శాతం యాక్టివ్ కేసులు కేరళలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3.1 కోట్లుగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 49.53 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.