bhagwat:భారత్‌లో ఉండాలంటే హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందేనని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తున్న‘వివేక్’ అనే హిందీ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ భగత్ ముస్లింలను ఉద్ధేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ముస్లింలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. భారతదేశ సంస్కృతిపై దాడి జరిగిన ప్రతిసారీ అన్ని మతాల ప్రజలు ఏకతాటిపై నిలబడి మన సంస్కృతీ సంప్రదాయాను పరిరక్షించుకోవటం చాలా సంతోషించదగినదని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.
హిందువులు మాత్రమే ఉండాలని మన భారత రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదని..కానీ ఇక్కడ ఉండాలంటే మాత్రం హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందేనని పరోక్షంగా ముస్లింలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు.
తమ స్వార్థ ప్రయోజనాలకు మనుషుల మధ్య విఘాతం కలిగిన వారే వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారని..భారత్ లో ముస్లింలకు కూడా ప్రత్యేకంగా స్థానం..గౌవరం కల్పించామని అన్నారు. మొగల్ చక్రవర్తిపై పోరాటానికి మహారాణ ప్రతాప్‌కు చాలా మంది ముస్లిం సైనికులు సహాయపడిన విషయాన్ని ఈ సందర్భంగా భగత్ గుర్తు చేశారు.
ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేనంతగా ముస్లింలు భారత్ లో చాలా సంతోషంగా ఉన్నారనే విషయాన్ని మరచిపోరాదని సూచించారు. మన సరిహద్దు దేశమైన పాకిస్థాన్‌లో ఇతర మతాల వారికి అసలు హక్కులే ఉండవని..కానీ భారత్ అలా కాదు ఎన్నో మతాల వారు చాలా సంతోషంగా ఉంటున్నారని గుర్తుచేశారు.
అయోధ్యలోని రామ్ ఆలయం గురించి మాట్లాడిన భగవత్..రామ్ మందిరం జాతీయ విలువలకు, స్వభావానికి ప్రతీక అన్నారు. భారతదేశాన్ని పాలించిన మొఘలు ఎన్నో హిందూ దేవాలయాలను నాశనం చేశారనీ..వారిని తరిమికొట్టిన రాజులు తమ ప్రాణాలను పణ్ణంగా పెట్టి దేశానికి సేవ చేశారని అన్నారు.అందుకే హిందూ సమాజం చాలా కాలం నుండి దేవాలయాలను పునర్నిర్మించాల్సిన అవసరముందని అన్నారు. అయోధ్యలో శ్రీ రామ్ మందిర నిర్మాణం దానికి తార్కాణమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అన్నారు.