Indian Railways : దేశవ్యాప్తంగా 26,281 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ డెలివరీ చేసిన ఇండియన్ రైల్వే

దేశవ్యాప్తంగా 26,281 మెట్రిక్ టన్నులకు పైగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను ఇండియన్ రైల్వేస్ సరఫరా చేసినట్లు ఆదివారం కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Indian Railways దేశవ్యాప్తంగా 26,281 మెట్రిక్ టన్నులకు పైగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను ఇండియన్ రైల్వేస్ సరఫరా చేసినట్లు ఆదివారం కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 376 ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు..1,534 ట్యాంకర్లలో 26,281 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను ఇప్పటివరకు వివిధ రాష్ట్రాలకు సరఫరా చేసినట్లే రైల్వే మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తద్వారా ఆక్సిజన్ కొరతను ఎదుర్కొనే రాష్ట్రాలకు ఎంతో ఉపశమనం కలిగించినట్లు తెలిపింది.

ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ,హర్యానా, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అసోం, మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, తమిళనాడు రాష్ట్రాలకు ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్..ఆక్సిజన్ ను డెలివరీ చేసినట్లు తెలిపింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఒక్కొక్కటి 3,000 మెట్రిక్ టన్నుల చొప్పున ప్రాణ వాయువును ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ద్వారా అందుకున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కు 2,800 మెట్రిక్ టన్నులకు పైగా ప్రాణవాయువును ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అందిచినట్లు తెలిపింది. హపా, బరోడా, ముంద్రా,రూర్కెలా, దుర్గాపూర్, టాటానగర్, అంగుల్ సహా వివిధ ప్రదేశాల నుండి ఆక్సిజన్ తీసుకొని దానిని పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు సరఫరా చేసినట్లు తెలిపింది.

43రోజుల క్రితం ఏప్రిల్-24 మహారాష్ట్రలో 126 మెట్రిక్ టన్నుల లోడ్ తో ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు..తమ డెలివరీని ప్రారంభించాయి. అవసరమైన రాష్ట్రాలకు సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో సాధ్యమైనంత ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్ ను అందించేందుకు భారత రైల్వే కృషి చేసింది. అందులోభాగంగానే ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ద్వారా తమకు ఆక్సిజన్ అందడంతో 15 రాష్ట్రాలు ఉపశమనం పొందాయి.

ట్రెండింగ్ వార్తలు