Indian Railways : రైల్వే ప్రయాణికులకు కీలక హెచ్చరిక.. భారతీయ రైల్వే కొత్త నిబంధనలు ఇవే

Indian Railways : భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ టికెట్లను ఉపయోగించే రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే కీలక సూచనలు జారీ చేసింది.

Indian Railways

Indian Railways : భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ టికెట్లను ఉపయోగించే రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే కీలక సూచనలు జారీ చేసింది. ఇకపై స్క్రీన్‌షాట్, ఫోటో, PDF కాపీ లేదా వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసిన డిజిటల్ టికెట్‌ను ప్రయాణానికి చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించబోమని స్పష్టం చేసింది. అసలు టికెట్ RailOne యాప్‌లోనే చూపించాల్సి ఉంటుందని తెలిపింది.

Also Read : Thalliki Vandanam : తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు అలర్ట్.. ఈ పొరపాటు ఎవ్వరూ చేయొద్దు.. ఇవి తప్పనిసరి

రైల్వే అధికారుల ప్రకారం, ఈ నిబంధనలు ముఖ్యంగా డిజిటల్ అన్‌రిజర్వ్డ్ (UTS) టికెట్లకు వర్తిస్తాయి. టికెట్‌ను బుక్ చేసిన అదే రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్‌లో అసలు టికెట్ అందుబాటులో ఉండాలి. టికెట్ చెకింగ్ సమయంలో స్క్రీన్‌షాట్ లేదా ఇతర యాప్‌ల ద్వారా పంపిన కాపీలను చూపితే అవి చెల్లుబాటు కావని అధికారులు స్పష్టం చేశారు.

డిజిటల్ టికెట్‌ను రైలు బయలుదేరే ముందు తప్పనిసరిగా బుక్ చేయాలి. రైలు బయలుదేరిన తర్వాత తీసుకున్న టికెట్ చెల్లుబాటు కాదని రైల్వే పేర్కొంది. టికెట్ చెకింగ్ సమయంలో ప్రయాణికులు అసలు డిజిటల్ టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు కూడా వెంట ఉంచుకోవాలని రైల్వే సూచించింది.

ఈ నిబంధనల ఉద్దేశం నకిలీ టికెట్లు, స్క్రీన్‌షాట్‌ల దుర్వినియోగం, ఒకే టికెట్‌ను పలువురు ఉపయోగించే ఘటనలను అరికట్టడమేనని అధికారులు తెలిపారు. ప్రయాణికులు టికెట్ తనిఖీ సమయంలో ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా RailOne యాప్‌లోని అసలు టికెట్‌ను చూపించేందుకు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.