Anji Khad Bridge: ప్రారంభానికి సిద్ధమవుతున్న దేశంలో తొలి తీగల రైల్వే వంతెన.. ఎక్కడ ఉంది? ప్రత్యేకతలు ఏమిటంటే..?

ఉదంపూర్ - శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా హిమాలయ పర్వతాలలోని యువ మడత పర్వతాలలో అంజి నదిపై నిర్మిస్తున్న అంజి‌ఖాడ్ రైల్వే తీగల వంతెన దాదాపు 1086 అడుగుల ఎత్తులో నిర్మాణం అవుతుంది.

India's first cable-stayed rail bridge

Anji Khad Bridge: దేశంలోనే తొలి రైల్వే తీగల వంతెన ప్రారంభానికి సిద్ధమవుతోంది. జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుతూ భారతదేశంలో మొదటి రైల్వే తీగల వంతెన అంజిఖాడ్ వంతెన. జమ్మూలోని రైసీ జిల్లాలో చేపట్టిన ఈ వంతెనను ఇంజనీరింగ్ అద్భుతంగా పేర్కొంటారు. ఈ అంజిఖాడ్ తీగల వంతెన జమ్మూ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వంతెనకు ప్రేరణ, డిజైన్, సాంకేతికత మహారాష్ట్ర ముంబైలోని చాలా ప్రసిద్ధి బాంద్రా – వర్లీసీ లింక్ నుంచి తీసుకోబడింది.

India’s first cable-stayed rail bridge

ఉదంపూర్ – శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా హిమాలయ పర్వతాలలోని యువ మడత పర్వతాలలో అంజి నదిపై నిర్మిస్తున్న అంజి‌ఖాడ్ తీగల వంతెన దాదాపు 1086 అడుగుల ఎత్తులో నిర్మాణం అవుతుంది. దీని నిర్మాణానికి సుమారు 400 కోట్లు వెచ్చించారు.  11 నెలల వ్యవధిలో ఈ రైల్వే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తీగల అమరికకు సంబంధించిన వీడియోను ఆయన తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లెంట్ అంటూ ప్రశంసించారు. ఈ అంజీఖడ్ తీగల రైల్వే వంతెన.. జమ్మూ – బారాముల్లా మార్గంలోని కాట్రా – రైసీ సెక్షన్లను కలుపుతుంది.

India’s first cable-stayed rail bridge

ఈ వంతెన భారీ తుఫాన్‌లను తట్టుకోగలదు. 216 కిలో మీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకోగలదు. అంతేకాదు.. 40 కిలోల వరకు పేలుడు పదార్థాలతో కూడిన పేలుడు కూడా వంతెనను ధ్వంసం చేయలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. వంతెన మొత్తం పొడవు 725 మీటర్లు. ఈ అంజిఖాడ్ వంతెనకు 96 ప్రధాన తీగలతో అనుసంధానించారు.

India’s first cable-stayed rail bridge

జమ్మూ, కాశ్మీర్ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు అనేక కొత్త ప్రయాణ అనుభవాలను ఈ వంతెన అందిస్తోంది. ఫిబ్రవరి 2024 నాటికి సిద్ధమవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే, ఈ రైల్వే తీగల వంతెన నిర్మాణం మాత్రం అతి త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ అంజిఖాడ్ వంతెన కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో మొదటిసారి రైలు ద్వారా కలుపుతుంది.