Indian Railways : రైల్వే ప్యాసెంజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఏ స్టేషన్‌ నుంచైనా రైలు ఎక్కొచ్చు..!

రైల్వే ప్యాసెంజర్లకు గుడ్‌న్యూస్.. మీరు ఇకపై ఏ రైల్వే స్టేషన్‌లో నుంచైనా రైలు ఎక్కొచ్చు.. బుకింగ్ చేసుకున్న బోర్డింగ్ స్టేషన్‌ నుంచి కాకుండా ఏ స్టేషన్ నుంచైనా ట్రైన్ ఎక్కొచ్చు.

Indian Railways Station : రైల్వే ప్యాసెంజర్లకు గుడ్‌న్యూస్.. మీరు ఇకపై ఏ రైల్వే స్టేషన్‌లో నుంచైనా రైలు ఎక్కొచ్చు.. టికెట్ బుకింగ్ చేసుకున్న బోర్డింగ్ స్టేషన్‌ నుంచి కాకుండా ఏ స్టేషన్ నుంచైనా ట్రైన్ ఎక్కొచ్చు. ఇందుకోసం భారత రైల్వే శాఖ రూల్స్ మార్చింది. ఇప్పటివరకూ బోర్డింగ్ స్టేషన్ నుంచి కాకుండా ఇతర రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కితే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. రైల్వే శాఖ మార్చిన ఈ కొత్త రూల్స్ ద్వారా ప్యాసెంజర్లు బుకింగ్ చేసిన రైల్వే స్టేషన్ కు బదులుగా ఏ రైల్వే స్టేషన్ నుంచైనా రైలు ఎక్కొచ్చు.. ఎలాంటి జరిమానా పడదు. అయితే మీరు బుకింగ్ చేసిన రైలు టికెట్లలో బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకు మీరు మీ టిక్కెట్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. లేదంటే జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్యాసెంజర్లు అనుకోకుండా తమ బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవాల్సి వస్తుంది.

అలాంటి సమయాల్లో వేరే స్టేషన్ నుంచి బోర్డింగ్ చేస్తే.. వారికి జరిమానా పడుతోంది. బోర్డింగ్ స్టేషన్‌ దూరంలో ఉన్న రైల్వే ప్రయాణీకులు సమయానికి స్టేషన్‌కు చేరుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవేళ ఆలస్యంగా స్టేషన్ కు చేరుకుంటే రైలు మిస్ అయిపోతుందనే ఆందోళన ఎక్కువగా ప్రయాణికుల్లో కనిపిస్తోంది. అందుకే బోర్డింగ్ స్టేషన్ నుంచి కాకుండా ప్రయాణికులు ఎక్కడి నుంచి అయినా ట్రైన్ ఎక్కేందుకు రైల్వే శాఖ ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. బోర్డింగ్ స్టేషన్ దూరంగా ఉన్న రైలు ప్రయాణికులు.. తమకు దగ్గరలోని రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కేయొచ్చు. అప్పుడు ప్రయాణికులు తప్పనిసరిగా తమ టికెట్ బోర్డింగ్ స్టేషన్ సవరించుకోవాల్సి ఉంటుంది. IRCTC బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే అవకాశాన్ని అందిస్తోంది. ఈ సదుపాయాన్ని ట్రావెల్ ఏజెంట్ల ద్వారా లేదా ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా కాకుండా ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులందరికి IRCTC ఈ సదుపాయాన్ని అందిస్తోంది.

VIKALP బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులు PNRలలో బోర్డింగ్ స్టేషన్‌ను మార్పు చేసుకోలేరని గుర్తించాలి. రైలు బయల్దేరిన 24 గంటల్లోగా.. బోర్డింగ్ స్టేషన్‌ని మార్చుకోవాల్సి ఉంటుంది. రైలు ప్రయాణానికి 24 గంటల ముందు ఆన్‌లైన్‌లో మార్పులు చేసుకోవాలి. IRCTC అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. రైల్వే ప్రయాణీకుడు తన బోర్డింగ్ స్టేషన్‌ను ఒకసారి మార్చిన తర్వాత ముందుగా బుకింగ్ చేసుకున్న బోర్డింగ్ స్టేషన్ నుంచి రైలు ఎక్కడానికి వీలుండదు. ఒకవేళ రైలు ప్రయాణీకుడు తన బోర్డింగ్ స్టేషన్‌ను మార్చకుండా మరో రైల్వే స్టేషన్ నుంచి రైలు ఎక్కినట్టయితే.. సదరు ప్రయాణికుడికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. బోర్డింగ్ పాయింట్, సవరించిన బోర్డింగ్ పాయింట్ మధ్య ఛార్జీలను కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. IRCTC రూల్స్ ప్రకారం.. బోర్డింగ్ స్టేషన్‌ మార్చుకోవడం ఒకసారి మాత్రమేని గుర్తించుకోవాలి. అందుకే రైలు టికెట్ మార్పులు చేయడానికి ముందే అన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

బోర్డింగ్ స్టేషన్‌ (Borad Station) మార్చుకోవాలంటే..
1. ముందుగా మీరు IRCTC అధికారిక వెబ్‌సైట్ (https://www.irctc.co.in/nget/train-search) విజిట్ చేయండి..
2. లాగిన్ (Login) చేయండి.. ‘Booking Ticket History’లోకి వెళ్లండి.
3. మీరు ఎక్కాల్సిన రైలును ఎంచుకోండి.. ‘Change Boarding Point’ ఆఫ్షన్‌ సెలక్ట్ చేయండి.
4. డ్రాప్ డౌన్‌లో మీరు ఎంచుకున్న రైలుకు కొత్త బోర్డింగ్ స్టేషన్‌ మార్చుకోవాలి.
5. కొత్త స్టేషన్‌ని ఎంచుకున్న తర్వాత.. సిస్టమ్ confirmation అడుగుతుంది. మీరు ‘OK’పై క్లిక్ చేయండి.
6. బోర్డింగ్ స్టేషన్‌ మారినట్టుగా మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు SMS కూడా వస్తుంది.

Read Also : Train ticketలు post officeలలోనూ క్యాన్సిల్ చేసుకోవచ్చు

ట్రెండింగ్ వార్తలు