దేన్నీ వదలటం లేదు : రైల్వేలో టీ కప్పులపై మోడీ చౌకీదార్

ఎన్నికల ప్రచారం కోసం ప్రతి వస్తువును వాడేస్తున్నారు. ప్రచారానికి అస్త్రాలుగా ఆఖరికి తాగే టీ కప్పులను కూడా వదలడం లేదు. పేపర్ టీ కప్పులపై కూడా మై బీ చౌకీదార్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారానికి తెరతీశారు.

  • Publish Date - March 29, 2019 / 10:11 AM IST

ఎన్నికల ప్రచారం కోసం ప్రతి వస్తువును వాడేస్తున్నారు. ప్రచారానికి అస్త్రాలుగా ఆఖరికి తాగే టీ కప్పులను కూడా వదలడం లేదు. పేపర్ టీ కప్పులపై కూడా మై బీ చౌకీదార్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారానికి తెరతీశారు.

ఎన్నికల ప్రచారం కోసం ప్రతి వస్తువును వాడేస్తున్నారు. ప్రచారానికి అస్త్రాలుగా ఆఖరికి తాగే టీ కప్పులను కూడా వదలడం లేదు. పేపర్ టీ కప్పులపై కూడా మై బీ చౌకీదార్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారానికి తెరతీశారు. రైల్వే బోర్డులో జరిగిన తప్పిదంతో ఎన్నికల మోడల్ కోడ్ ఉల్లంఘనకు గురైంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.
Read Also : భ్రష్టు పట్టిస్తోంది : ఏంటీ ‘Bigo Live’.. మాయలో కుర్రోళ్లు

ఈ క్రమంలో చౌకీదార్ పేరుతో రైల్లో పేపర్ టీ కప్పులు దర్శనమిచ్చాయి. ఖోత్ గూదాంకు వెళ్తున్న శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైల్లో సర్వ్ చేసిన చౌకీదార్ టీ కప్పును ఓ ప్రయాణికుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. పేపర్ కప్ పై .. నేను కూడా చౌకీదార్ నే అని హిందీలో రాసి ఉంది. ఈ వైరల్ ఫొటోపై స్పందించిన రైల్వేబోర్డు వెంటనే పేపర్ కప్స్ కంట్రాక్ట్ ను రద్దు చేసుకున్నట్టు ప్రకటించింది. సదరు కంట్రాక్టర్ కు భారీ జరిమానా విధించింది. 

పేపర్ కప్ పై ప్రకటన ఇచ్చింది సంకల్ప్ ఫౌండేషన్ కు చెందిన ఓ ఎన్జీవో సంస్థగా తెలుస్తోంది. టీ కప్పులపై మెయిన్ భీ చౌకీదార్ అని హిందీ అక్షరాల్లో రాసి ఉన్నట్టు విచారణలో వెల్లడైంది. టీ కప్పులపై చౌకీదార్ పేరుతో సర్వ్ చేయడానికి IRCTC నుంచి ఎలాంటి ఆమోదం లేదని, వెంటనే ఈ తప్పిదానికి రైల్వే సూపర్ వైజర్, అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. పేపర్ టీ కప్పులను అందించే సర్వీసు ప్రొవైడర్ కు రూ.లక్ష వరకు జరిమానా విధించారు. క్రమశిక్షణ చర్యల కింద సదరు సర్వీసు ప్రొవైడర్ కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్టు ఐఆర్ సీటీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. 
Read Also : ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి : జియో టాప్ 5 డేటా ప్లాన్ ఆఫర్లు ఇవే

రైల్వేలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఘటన జరగడం ఇది రెండోసారి. ఇటీవల రైల్వే టికెట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలు దర్శనమివ్వడంతో తృణమూల్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రైల్వే బోర్డు ప్రయాణికులకు జారీ చేసే టికెట్లను విత్ డ్రా చేసుకుంది. దీనిపై రైల్వే స్పందిస్తూ.. ఉద్దేశపూర్వకంగా చేసిందికాదని, అనుకోకుండా జరిగిన తప్పిదంగా వివరణ ఇచ్చుకుంది. మరోవైపు రైల్వే నిర్వాకంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.  

Read Also : అకౌంట్ unlock కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్