×
Ad

Kullu Manali : దేశంలో ఇంకా కరోనా పోలేదు.. వీళ్లేంటి ఇలా చేస్తున్నారు

దేశంలో సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుంది.. ఇంతలోనే మ్యుటేట్ల రూపంలో మరో ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. డెల్టా, డెల్టాప్లస్ వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. సెప్టెంబర్ లో థర్డ్ వేవ్ విజృంభించనుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ వేవ్ పై పరిశోధనలు చేసిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బృందం కూడా ఇదే తేల్చింది. థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని చెబుతున్నారు.

Kullu Manali

Kullu Manali : దేశంలో సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుంది.. ఇంతలోనే మ్యుటేట్ల రూపంలో మరో ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. డెల్టా, డెల్టాప్లస్ వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. సెప్టెంబర్ లో థర్డ్ వేవ్ విజృంభించనుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ వేవ్ పై పరిశోధనలు చేసిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బృందం కూడా ఇదే తేల్చింది. థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని చెబుతున్నారు.

ఇక ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనల్లో సడలింపులు ఇస్తున్నాయి. దీంతో రవాణా వ్యవస్థ గాడినపడింది. అన్ని అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కరోనా కారణంగా ఏడాదిన్నరగా ఇంట్లోనే ఉంటున్నవారు నిబంధనలు సడలింపు ఇవ్వడంతో జాలిగా ఓ ట్రిప్ వేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక కొందరైతే ఇప్పటికే పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వెళ్లారు. దేశంలో అత్యధిక పర్యాటక ప్రదేశాలు కలిగిన రాష్ట్రాల్లో ఒకటైన హిమాచల్ ప్రదేశ్ లో పర్యాటకుల సందడి మొదలైంది.

ఆ రాష్ట్రంలో కరోనా నిబంధనలు పూర్తిగా ఎత్తేయడంతో కొత్తగా పెళ్ళైన జంటలు క్యూ కట్టాయి. దీంతో హిమాచల్ లోని పర్యాటక ప్రాంతాలైన మనాలి, సిమ్లా, కులు-మనాలి, ధర్మశాల వంటి ప్రాంతాలు పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి. కరోనా నిబంధలు గాలికొదిలేసి, సామాజిక దూరం మరిచి విధుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెట్టింట చర్చ మొదలైంది. కరోనా థర్డ్ వేవ్ కు హిమాచల్ పర్యాటకులు బాటలు వేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఆసుపత్రుల్లో బెడ్లు దొరకలేదు.. ఇకపై హోటల్ లో బెడ్స్ ఖాళీగా ఉండవంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే పర్యాటకులను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో ముప్పు రాబోతుందని హెచ్చరిస్తున్నారు. ఇంకొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ నుంచి కూడా చాలామంది హిమాచల్ ప్రదేశ్ వెళ్లేందుకు ట్రైన్, ఫైట్ టికెట్స్ బుక్ చేసుకొని పెట్టుకున్నారు. కొందరేమో ఆఫీసుల్లో సెలవుల కోసం ఎదురుచూస్తున్నారు.