Site icon 10TV Telugu

Indian womans Cosmetics : మేకప్ కోసం రూ.5,000 కోట్లు ఖర్చు చేసిన భారతీయ మహిళలు

Indian womans purchases of cosmetics

Indian womans purchases of cosmetics

Indian womans purchases of cosmetics : భారతీయ మహిళలు వారి మేకప్పుల కోసం రూ.5,000 కోట్లు ఖర్చు చేశారట..అదికూడా ఆరంటే ఆరు నెలల్లో.. అందం కోసం తమకున్న అందాన్ని మరింతగా పెంచుకోవటం కోసం భారతీయ మహిళలు ఆరు నెలల్లో రూ.5,000 కోట్లు ఖర్చు చేశారట. ఇదేదో ఆషామాషీగా చెబుతున్న మాటలు కాదు. ఓ సర్వేలో తేలిని ‘అందమైన’ నిజం..

మేకప్ అంటే క్రీములు,లిప్ స్టిక్కులు(lipsticks), నెయిల్ పాలిష్ లు(nail polishes),ఐలైనర్లు(eyeliners), ఐలాషెష్ ( eyelashes)లు ఇలా ఎన్నో ఉన్నాయి. అటువంటి కాస్మెటిక్స్ (cosmetics)కోసం భారతీయ మహిళలు (Indian womans)ఆరునెలల్లోను రూ.5,000 ఖర్చు చేశారని కాంతర్ వరల్డ్ ప్యానల్ (Kantar Worldpanel) నివేదిక వెల్లడించింది. వర్కింగ్ ఉమెన్స్ (Working Womens)సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సాధారణంగా మహిళలు ఇంట్లో ఖాళీగా ఉండటంలేదు. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు..బిజినెస్ ఉమెన్స్ గా రాణిస్తున్నారు. వారి వారి ఉద్యోగ స్థాయిలను బట్టి మేకప్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. అందంగా కనిపించాలి. ఉదాహరణకు రిసెప్షనిస్టులు, ఎయిర్ హోస్టెస్ లు. హోటల్స్ లో పనిచేసే మహిళలు ఇలా వారి వారి ఉద్యోగాలను బట్టి మేకప్ అనేది అవసరం. లిప్ స్టిక్ తో పాటు ఇతర మేకప్ అనివార్యంగా మారింది.దీంతో నేరుగాను..ఆన్ లైన్ లలోను కాస్మెటిక్స్ కొనుగోళ్లు జరుపుతున్నారు.

అలా మేకప్ సామగ్రి (Makeup equipment)కోసం మహిళలు గత ఆరు నెలల్లో భారత్‌లోని 10 నగరాల్లోనే 100 మిలియన్లకుపైగా లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్, ఐలైనర్స్ వంటివి కొనుగోలు చేశారట మహిళా మణులు. బ్యూటీ ఉత్పత్తుల కోసం ఏకంగా ఈ ఆరు నెలల్లో రూ. 5,000 కోట్లు ఖర్చు చేశారు. వీరిలో 40శాతం మంది మహిళలు ఆన్ లైన్ లోనే కొంటున్నారని కాంతర్ వరల్డ్ ప్యానల్ నివేదికలో వెల్లడించింది.

Heart Emoji : అక్కడంతే..వాట్సాప్ లో హార్ట్ ఎమోజీ పంపితే రూ.20 లక్షల జరిమానా, జైలుశిక్ష కూడా

భారతీయులు సగటున ఒక్కొక్కరు ఈ ఆరు నెలల్లో రూ. 1,214 కాస్మెటిక్స్ కోసం ఖర్చు చేశారని తెలిపింది. వీటిలో లిప్ స్టిక్ వంటివే ఎక్కువగా ఉన్నాయి. పెదవలు అందంగా కనిపించటానికి 38 శాతం లిప్ స్టిక్కులు కొనుగోలు చేశారు. ఆ తరువాత స్థానంలో గోళ్లు అందంగా కనిపించటానికి నెయిల్ పాలిష్ కూడా భారీగానే ఉన్నారట. భారతీయుల్లో అందం కోసం ఆరాటపడుతున్న తీరును ఇది తెలియజేస్తోందని నివేదిక పేర్కొంది. అలాగే కాస్మెటిక్ మార్కెట్లో వర్కింగ్ వుమెన్ పాత్ర ఎక్కువగా ఉందని..వారే ఎక్కువగా సౌందర్య సాధనాలు కొంటున్నారని తెలిపింది. సగటు ఖర్చుతో పోలిస్తే ఉద్యోగం చేస్తున్న మహిళలో మేకప్ సేల్స్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ 1.6 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారట..

షాపర్స్ స్టాప్ రిపోర్ట్ (Shoppers Stop reported)ప్రకారం.. గత మూడు నెల్లలోనే తమ సేల్స్‌లో 1,50,000 మేకప్ కిట్స్ విక్రయాలు జరిగాయని వెల్లడించింది. ఇది మేకప్ ఆర్టికల్స్, బ్రాండ్స్ కోసం భారతీయ వినియోగదారుల్లో పెరుగుతున్న ఆసక్తిని చూపిస్తోంది. అలాగే కాస్మెటిక్స్ ఎలా కొనాలి..?వాటిని ఎలా వినియోగించాలనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారట.

Joe Biden Viral Pic : షర్టు లేకుండా జో బైడెన్ .. హాలీవుడ్ యాక్షన్ హీరోలా పోజులు

మూడు వంతుల సేల్స్ రిటైల్ మార్కెట్ ద్వారానే జరుగుతన్నాయని..అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ కూడా ఈ కొనుగోళ్లకు కారణమవుతోందని నివేదిక పేర్కొంది. అన్ని రకాల వయసుల వారు ఇవి కొంటున్నా..కాస్త వయసు ఎక్కువగా ఉన్నవారు లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్ కోసం చూస్తుంటే.. యువతులు మాత్రం ప్రీమియర్ లిప్ బామ్ కొనుగోలు చేస్తున్నారని వెల్లడించింది.

భారతీయులు కాజల్ (కాటుక)లిప్ స్టిక్ వంటి సంప్రదాయ వస్తువలను దాటి ప్రైమర్ లు, ఐషాడోలు, కన్నీలర్ వంటి ఉత్పత్తులపై ఆసక్తి చూపుతున్నారని రెనీ కాస్మెటిక్ ఫౌండర్ అశుతోష్ వలాని తెలిపారు.వారి ధరించే దుస్తులను బట్టి కూడా కాస్మెటిక్స్ కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.

 

Exit mobile version