India First Rapid Rail RAPIDX
India First Rapid Rail : భారతదేశంలో మొట్టమొదటి ర్యాపిడ్ రైలు ఉత్తరాదిలో పరుగులు పెట్టనుంది. రాపిడిక్స్ (RAPIDX )అని పేరు గల ఈ సెమీ హైస్పీడ్ రైలు ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మార్గంలో పరుగులు పెట్టనుంది. ఈ మార్గంలోని 82-కిలోమీటర్ల పొడవైన కారిడార్ లో సేవలు అందించనుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) ఈరైలుకు RAPIDX అనే పేరు పెట్టిందని అధికారులు మంగళవారం (ఏప్రిల్ 11,2023)న ప్రకటించారు.
పట్టణ మెట్రో రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న ఎన్సీఆర్టీసీ రాపిడిక్స్ ద్వారా దేశంలో మొదటి సెమీ-హైస్పీడ్ ప్రాంతీయ రైలు సేవలకు శ్రీకారం చుట్టనుంది.వేగంతోపాటు అధునాతన సాంకేతికతతో నడిచే రాపిడిక్స్ రైలుతో ప్రయాణ సమయం తగ్గనుంది. 2025 నాటికి ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మార్గంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఎన్సీఆర్టీసీ టార్గెట్ గా నిర్ణయించుకుంది.