ప్రముఖ పారిశ్రామికవేత్త మోడీ కన్నుమూత
ప్రముఖ పారిశ్రామికవేత్త కృష్ణ కుమార్ మోడీ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేకే మోడీ శనివారం(నవంబర్ 2,2019) ఉదయం తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త కృష్ణ కుమార్ మోడీ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేకే మోడీ శనివారం(నవంబర్ 2,2019) ఉదయం తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త కృష్ణ కుమార్ మోడీ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేకే మోడీ(79) శనివారం(నవంబర్ 2,2019) ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రముఖ కంపెనీలైన గాడ్ ఫ్రే ఫిలిప్స్(సిగరెట్ తయారీ), ఇండోఫిల్ ఇండస్ట్రీస్, మోడీ కేర్, ఆగ్రో కెమికల్స్ లతో కూడిన మోడీ ఎంటర్ ప్రైజెస్ కు ఆయన ఛైర్మన్ గా వ్యవహరించారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ)కి కేకే మోడీ ఛైర్మన్ గా పనిచేశారు. మోడీనగర్ పట్టణాన్ని స్థాపించిన రాయ్ బహదూర్ గుజర్మల్ మోడీ పెద్ద కుమారుడే కేకే మోడీ. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ.. కేకే మోడీ పెద్ద కుమారుడు. కేకే మోడీ 1940లో జన్మించారు. మోడీ మృతి పట్ల పలువురు వ్యాపార ప్రముఖులు సంతాపం తెలిపారు.
తన తండ్రి మరణవార్తను తెలుపుతూ లలిత్ మోడీ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. లవ్ యు డ్యాడ్ అంటూ ట్వీట్ చేశారు.
A #tribute to my #Dad #kkmodi who left us today. He will be truly missed by us. May his soul rest in peace. Love you Dad ????? You will always be a part of me. pic.twitter.com/bsav66m6KY
— Lalit Kumar Modi (@LalitKModi) November 3, 2019