Nandan Nilekani : ఐఐటీ బాంబే 50 ఏళ్ల వేడుకలు .. రూ.315 కోట్లు విరాళం ఇచ్చిన నంద‌న్ నిలేకని

ఐఐటీ బాంబే (IIT Bombay)కు చెందిన పూర్వ విద్యార్థుల గ్రూపుకు నందన్ నీలేకని రూ. 315 కోట్లు విరాళం ఇచ్చారు.

Nandan Nilekani

Nandan Nilekani IIT Bombay : మనం ఎంత ఎత్తు ఎదిగినా ఏ స్థాయికి వెళ్లినా చదువుకున్న విద్యాసంస్థలపై అభిమానం మాత్రం ఎప్పటికీ పోదు. ఏదో రూపంగా ఆ జ్ఞాపకాలు మదిలో మెదులుతుంటాయి. తాము చదువుకున్న విద్యాసంస్థలకు ఏదైనా చేయాలనిపిస్తుంది. అలాగే అనుకున్నారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని(Infosys co-founder Nandan Nilekani). తన విద్యాసంస్థ అయిన ఇండియన్ ఇన్ స్టిట్యూషన్ టెక్నాలజీ (IIT) బాంబే (Indian Institute of Technology (IIT) Bombay)..దానితో తనకున్న అనుబంధానికి గుర్తుగా భారీగా విరాళమిచ్చారు. 1973లో ఐఐటీ బాంబేలో ఆయ‌న ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ (Bachelor’s degree in electrical engineering)చేశారు. ఐఐటీ బాంబే (IIT Bombay)50 ఏళ్ల వేడుక‌ల్ని (50 years celebrate)నిర్వ‌హిస్తున్న సంద‌ర్భంగా ఆయ‌న ఈ విరాళం ప్ర‌క‌టించారు.

Kedarnath Dham: కేదార్‌నాథ్‌ ఆలయం గర్భగుడిలో శివలింగంపై కరెన్సీ నోట్లు.. వీడియో వైరల్.. మహిళపై కేసు నమోదు

ఐఐటీ బాంబే (IIT Bombay)కు చెందిన పూర్వ విద్యార్థుల గ్రూపున‌కు రూ. 315 కోట్లు విరాళం ఇచ్చారు. త‌న విరాళంతో ఆ విద్యా సంస్థ‌లో ప్ర‌పంచ స్థాయి మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌నున్న‌ామని..ఇంజినీరింగ్‌, టెక్నాల‌జీ రంగాల్లో ప‌రిశోధ‌న‌లు పెంచ‌నున్న‌ామని తెలిపారు. టెక్నాల‌జీ స్టార్ట‌ప్ ఎకోసిస్ట‌మ్‌ను డెవ‌ల‌ప్ చేయ‌నున్న‌ట్లు ఓ ప్ర‌క‌టించారు.

ఈ సందర్భంగా నందన్ నీలేకని మాట్లాడుతు..ఐఐటీ బాంబే తనను గొప్పగా తీర్చి దిద్దింది అని తెలిపారు. తన జీవితంలో ఐఐటీ బాంబే ఎంతో కీలకమైనది..తన భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దిందని అన్నారు. నా భవిష్యత్తుకు చక్కటి పునాది వేసిందన్నారు. అలాంటి విద్యా సంస్థతో నాకు 50 ఏళ్ల అనుబంధం ఏర్ప‌డింద‌ని.. ఆ సంస్థకు మరింతమంది విద్యార్ధులను గొప్పగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో ఈ విరాళం ఇచ్చానని..ఇలా డొనేట్ చేసే అవకాశం నాకు కలిగినందుకు ఆ సంస్థ అందించిన సహకారినికి నన్ను తీర్చిదిద్దిన విధానానికి కృతజ్ఞుడిని అని తెలిపారు. కాగా గతంలో కూడా నందన్ నీలేకని ఇదే ఐఐటీ బాంబేకు రూ.85 కోట్లు విరాళం ఇచ్చారు.