Karnataka Elections 2023 : ఓటు హక్కు వినియోగించుకున్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖులు కూడా భారీగా తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీంట్లో భాగంగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి , అతని భార్య సుధా మూర్తి జయనగర్‌లోని బిఎస్‌ఇ కాలేజీ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Narayan Murthy and his wife Sudha Murthy

Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా భారీగా తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీంట్లో భాగంగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి , అతని భార్య సుధా మూర్తి జయనగర్‌లోని బిఎస్‌ఇ కాలేజీ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా మూర్తి దంపతులు ఓటర్లు పిలుపునిచ్చారు. నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి మాట్లాడుతు.. ఓటు ప్రజాస్వామ్యంలో పవిత్ర భాగం కాబట్టి ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. పెద్ద వాళ్ళను చూసి నేర్చుకోండి
అంటూ యువతకు సూచనలు చేశారు. మేము పెద్దవాళ్ళం.. 6 గంటలకు లేచి ఇక్కడకు వచ్చి ఓటు వేసాం ప్రతీ ఒక్కు ఓటు వేయాలి..ముఖ్యంగా యువత తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని ఓటు ప్రజాస్వామ్యంలో పవిత్ర భాగం
అని పిలుపునిచ్చారు.

కాగా ఓటుహక్కు వినియోగించుకోవటానికి ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్ని పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. నటుడు ప్రకాశ్ రాజ్, గణేశ్, నటి అమూల్య,సీఎం బసవరాజు బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప ఓటు హక్కు వినియోగించుకున్నారు.