Supreme Court : అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారణ.. అవినాష్ రెడ్డి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ

తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ డా.సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Supreme Court (1)

Avinash Reddy Bail Cancellation :  మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అవినాష్ రెడ్డి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ జులై3వ తేదీకి వాయిదా వేసింది. జులై 3న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి డివై చంద్ర‌చూడ్ ధ‌ర్మాస‌నం నుంచి ఆదేశాలు తీసుకుని విచారించాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సుందరేష్ ల ధర్మాసనం తెలిపింది.

కాగా, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ డా.సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. మే30న తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ డా.సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డా.సునీతా రెడ్డి తరపు సిద్ధార్థ లూత్ర వాదనలు వినిపించారు.

Dwarampudi Chandrasekhar : పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ వ్యభిచారి.. ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు

అవినాష్ రెడ్డి కేసు దర్యాప్తుకి సహకరించడం లేదని తెలిపారు. కేసు విచారణ ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు బదిలీ కూడా జరిగిందన్నారు. జూన్ 30 వరకు కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిందని డా.సునీతా రెడ్డి తరపు న్యాయవాది మరో సారి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు