Groom Tied Tali Aunt Neck : వధువుకు బదులు అత్త మెడలో తాళి కట్టిన వరుడు

బిత్తిరి వ్యవహారంతో టెన్షన్ పడుతూ కనిపిస్తారు. సాధారణంగా వరుడు.. వధువు మెడలో తాళి కడతాడు. కానీ ఓ వ్యక్తి పెళ్లి కుమార్తెకు బదులు ఆమె తల్లి మెడలో తాళి కట్టాడు.

tali aunt's neck

Groom Tied Tali Aunt Neck : కొంతమంది ప్రతీ విషయానికి కంగారు పడుతుంటారు. చిన్న చిన్న విషయాల్లోనూ ఆందోళన పడుతుంటారు. నిలకడలేని ప్రవర్తన కలిగినవారిని ఉద్దేశించి ఆగమాగం అల్లుడు అత్త మెడల పుస్తె కట్టిండట అనే సామెత వచ్చినట్లుంది. ఇలాంటి వారు అన్ని కాలాల్లోనూ తారసడుతారు. బిత్తిరి వ్యవహారంతో టెన్షన్ పడుతూ కనిపిస్తారు. సాధారణంగా వరుడు.. వధువు మెడలో తాళి కడతాడు. కానీ ఓ వ్యక్తి పెళ్లి కుమార్తెకు బదులు ఆమె తల్లి మెడలో తాళి కట్టాడు.

అలాంటి ఓ వ్యక్తికి రాకరాక ఒక పెళ్లి సంబంధం వచ్చిందంట. అది కూడా ఎన్నో అడ్డంకులు దాటుకుని పెళ్లి వరకు వచ్చింది.  వివాహ వేదికపై పంతులుగారు తాళికట్టు నాయనా అనగానే. అసలు ఎవరికి కట్టాలో అర్థంకాక వధువు పక్కనున్న అత్త మెడలో తాళి కట్టిండట.

Power Failure: కరెంట్ పోయింది.. చీకట్లో వధువు సోదరికి తాళి కట్టిన వరుడు

కొంత మంది పరిస్థితి ఇలాగే ఉంటుంది. తమకు తెలియని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయరు. పైగా ఏదైనా అనుమానం, సమస్య వస్తే ఆగమాగం అవుతారు. బయటికి హుందాగా కనిపించినా తమ డొల్లతనాన్ని సులువుగా బయట పెట్టేస్తుంటారు.