ఇంటెలిజెన్స్ వార్నింగ్ : ఢిల్లీలో హై అలర్ట్  

  • Publish Date - March 1, 2019 / 06:03 AM IST

ఢిల్లీలో హై అలర్డ్. పాకిస్థాన్- భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల క్రమంలో దేశంపై టెర్రరిస్టులు దాడిచేసే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. భద్రతా దళాలకు సూచనలు చేసింది. అదే విధంగా దేశవ్యాప్తంగా అలర్ట్  ప్రకటించింది. ఢిల్లీలోని 29 ప్రాంతాలపై టెర్రరిస్టులు టార్గెట్ చేసినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించటంతో పటిష్టమైన చర్యలు తీసుకుంది. జనావాసాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను టెర్రరిస్టులు టార్గెట్ చేస్తారనే సమాచారం ఉండటంతో.. భారీ ఎత్తున పోలీసులను మోహరించింది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నగరాన్ని హై అలర్డ్ జోన్ గా ప్రకటించింది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. 
 

నేషనల్ డిఫెన్స్, సేనా భవన్, ఇండియా హౌస్, చీఫ్ జస్టిస్ హౌస్, రెడ్ ఫోర్ట్, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవనం, సుప్రీంకోర్టు వంటి ముఖ్య ప్రాంతాల్లో కేంద్రం బలగాలు మోహరించాయి. అనుమానితులను తనిఖీ చేస్తున్నారు. ఢిల్లీ నగరాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మెట్రో ప్రయాణీకులు క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే వారికి అనుమతినిస్తున్నారు. ఢిల్లీ మొత్తంగా నిఘా నేత్రంలో కొనసాగుతోంది. గతంలో పార్లమెంట్ పై దాడి క్రమంలో పార్ల మెంట్ భవనం వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.