small savings accounts : చిన్నమొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు యథాతథం

చిన్నమొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గించాలన్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం చూపుతుందని భావించిన కేంద్రం రాత్రికి రాత్రే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

Interest rates on small savings accounts : చిన్నమొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గించాలన్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం చూపుతుందని భావించిన కేంద్రం రాత్రికి రాత్రే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. 2020-2021 చివరి త్రైమాసికం రేట్లే కొనసాగుతాయని తెలిపారు. మార్చి 31వరకు ఉన్న వడ్డీరేట్లే యథావిధిగా కొనసాగుతాయని ఆర్థికమంత్రి భరోసా ఇచ్చారు. చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించింది.

స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను 40 నుంచి 110 బేసిస్ పాయింట్ల మధ్యలో కోత విధించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. దీని ప్రకారం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు 7.1 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటును కూడా 6.8 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకంపై వడ్డీ రేటు7.6 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించారు.

ఇక పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌పై వడ్డీ రేటును 1.1 శాతం వరకు తగ్గింది. వీటిపై వడ్డీ రేటు 4.4 శాతం నుంచి 5.3 శాతం మధ్యలో ఉంది. అయితే మధ్య తరగతి ప్రజలపై వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఇది ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓట్లపై ప్రభావం చూపుతుందని భావించిన కేంద్రం…. ఆర్థిక శాఖ నిర్ణయాన్ని కొన్ని గంటల్లోనే వెనక్కి తీసుకుంది.

ట్రెండింగ్ వార్తలు