Survey on Women Reservation Bill: 27 తర్వాత మహిళా బిల్లు ఎట్టకేలకు పార్లమెంట్ ఆమోదం పొందింది. అయితే ఈ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి ముందే వివాదంలో చిక్కుకుంది. అదేంటంటే.. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా విధించాలని బీఎస్పీ, ఎస్పీ, ఆర్జేడీ లాంటి పార్టీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. కానీ, ప్రభుత్వం ఈ డిమాండ్ ను పట్టించుకోలేదు. కొన్ని విపక్ష పార్టీలు కూడా ఈ డిమాండుకు అంత మద్దతు ఇవ్వలేదు. అయితే దీనిపై ఒక జాతీయ మీడియా సంస్థ సర్వే చేయగా ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి.
రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వాలని ప్రశ్నించగా, ఇవ్వాలని 52 శాతం మంది ప్రజలు సమాధానమించ్చారు. 30 శాతం మంది ప్రజలు ఓబీసీ వర్గానికి చెందిన మహిళలకు రిజర్వేషన్లు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో 18 శాతం మంది ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో అయోమయ స్థితిలో ఉన్నారు, అంటే వారు ఈ ప్రశ్నకు ‘ఏమీ చెప్పలేను’ అని సమాధానం ఇచ్చారు.
మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు కోటా ఉండాలా?
అవును – 52
వద్దు – 30
చెప్పలేము- 18
రాజ్యసభలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 2 ఓట్లు పడ్డాయి. రెండు ఓట్లు ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎంపీలవి. ఇక రాజ్యసభ గురించి మాట్లాడితే బిల్లుకు అనుకూలంగా మొత్తం 214 ఓట్లు వచ్చాయి. రాజ్యసభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు.
పార్లమెంటులో మహిళల సంఖ్య 181కి చేరుతుంది
మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారితే 543 మంది సభ్యులున్న లోక్‌సభలో మహిళా సభ్యుల సంఖ్య 181కి చేరుతుంది. ప్రస్తుతం సభలో ఈ సంఖ్య 82 మంది మాత్రమే మహిళా ఎంపీలు ఉన్నారు. ఈ బిల్లు అమల్లోకి వచ్చిన వెంటనే లోక్‌సభతో పాటు శాసనసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది.