Anand Mahindra : చిన్నతనంలో జాతరలో విడిపోయాం.. ఓ ఫోటోపై ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్

అచ్చం తనలాగే ఉన్న ఓ వ్యక్తి ఫోటో చూసి వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Anand Mahindra

Anand Mahindra : మనిషిని పోలిన మనుష్యులు ఉంటారని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. అచ్చంగా తనలాగే ఉన్న వ్యక్తి ఫోటో చూసి వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Anand Mahindra : ఆనంద్ మహీంద్రాకి నోరూరించిన బ్రేక్ ఫాస్ట్ మెనూ.. అందులో ఏమున్నాయంటే?

ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆసక్తికరమైన పోస్టులు పెడుతుంటారు. నెటిజన్లకు సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా @pjdaddyofficial అనే ట్విట్టర్ యూజర్ ఆనంద్ మహీంద్రా పోలికలు ఉన్న తన కొలీగ్ ఫోటోను షేర్ చేశాడు. ‘”@anandmahindra ఈ వ్యక్తిని చూసిన తర్వాత మీరు కూడా షాకవుతారు. పూణేకి చెందిన నా కొలీగ్, ఆనంద్ మహీంద్రాలాగ ఉంటారు’ అనే శీర్షికతో ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేస్తూ షేర్ చేశాడు. దీనికి ఆనంద్ మహీంద్రా చాలా చమత్కారంగా స్పందించారు. ‘మా చిన్నతనంలో ఏదో జాతర సమయంలో విడిపోయి ఉంటాం’ అనే శీర్షికతో ఆనంద్ మహీంద్రా ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

KTR Reply to Anand Mahindra : డియర్ ఆనంద్ జీ.. మీకు తెలుసా? అంటూ ఆనంద్ మహీంద్రాకు కేటీఆర్ రిప్లై

ఆనంద్ మహీంద్రా పోస్టుపై నెటిజన్లు సైతం సరదాగా కామెంట్లు చేశారు. ‘మేళా కాదు ఆటో ఎక్సో పో కావచ్చు’ అని ఒకరు.. ‘అతను కోర్టుకు వెళ్తే మీ సోదరుడు కాదని నిరూపించుకోవాలి’ అంటూ మరొకరు చమత్కరించారు. మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్, 10 వేల పైన లైక్స్‌తో ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.