Nirmala Sitharaman : 2024-25 సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్ ను గురువారం ఉదయం 11గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. సుమారు 57 నిమిషాల పాటు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి మొరార్జీ రికార్డును నిర్మలా సీతారామన్ సమం చేశారు. మన్మోహన్, జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హా రికార్డులను నిర్మలా అధిగమించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ లో పలు విషయాలను ప్రస్తావించారు. మొత్తం రూ. 47.66 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మౌలిక వసతుల రంగానికి రూ.11.11 లక్షల కోట్లు కేటాయించారు. సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా ఆర్థిక విధానాలు ఉండబోతున్నాయని తెలిపారు. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. గతంలో సామాజిక న్యాయం కేవలం రాజకీయ నినాదంగా మాత్రమే ఉండేదని, కానీ, మేం దాన్ని అమలు చేసి చూపుతున్నామని నిర్మలా సీతారామన్ అన్నారు. పేదలు, మహిళలు, యువకులు, రైతులపై తమ ప్రభుత్వం దృష్టి సారిచిందని, గత పదేళ్లలో 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశఆమని చెప్పారు. రాష్ట్రాలకు సహకారం అందిస్తామని చెప్పారు.
బడ్జెట్ లో ముఖ్యమైన అంశాలు..
ప్రత్యక్ష, పరోక్ష పనుల్లో ఎలాంటి మార్పులు లేవని నిర్మలా సీతారామన్ తెలిపారు.
సరుకు రవాణా రంగాన్ని ప్రోత్సహించేలా మూడు ప్రధాన రైల్వే కారిడార్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
పరిశోధనను ప్రోత్సహించేందుకు లక్ష కోట్ల రూపాయల మూలధన నిధితో వడ్డీలేని దీర్ఘకాలిక రుణాలు అందివ్వనున్నట్లు చెప్పారు.
ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రాలకు వడ్డీలేని రుణ సహాయం అందివ్వటం జరుగుతుందని అన్నారు.
మధ్యతరగతి వర్గాల సొంతింటి నిర్మాణానికి నూతన విధానాన్ని అమల్లోకి తెస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం
మళ్లీ గెలుస్తామని ఆశిస్తున్నాం
80కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం ద్వారా ఆహార సమస్యను పరిష్కరించాం.
అవినీతి నిరోధించాం.. పాలనలో పారదర్శక విధానాలను పాటిస్తున్నాం.
25కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం.
34లక్షల కోట్ల రూపాయలను నేరుగా నగదు బదలీ ద్వారా పేదలకు అందించాం.
11.8 కోట్ల మంది రైతులకు నేరుగా నగదు సాయం అందిస్తున్నాం.
సామాజిక న్యాయం మా ప్రభుత్వం అనుసరించే విధానం.
నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారు.
పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ పురోగతికి చేరుకుంది.
సబ్ కా సాథ్.. సబ్కా వికాస్ మా నినాదం.
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ గా అవతరించేందుకు కృషి చేస్తున్నాం.
అన్నదాతలకు కనీస మద్దతు ధరను దశలవారిగా పెంచాం.
నాణ్యమైన విద్య అందిస్తున్నాం.
పదేళ్లలో ఉన్నత విద్య చదివే అమ్మాయిల సంఖ్య 28శాతం పెరిగింది.
గత పదేళ్లలో 7 ఐఐటీ, 7ఐఐఎం, 16 ట్రిపుల్ ఐటీలు, 390 యూనివర్శిటీలు, 15 ఎయిమ్స్ లు ఏర్పాటు.
యువత అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నాం.
స్కిల్ ఇండియా మిషన్ తో 1.40కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించాం
2023లో చెస్ లో 80మంది గ్రాండ్ మాస్టర్లు తయారయ్యారు.
ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు 30వేల కోట్లు ముద్రా రుణాలు.
పీఎం ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇళ్లలో 70శాతం మహిళలకే.
గ్రామీణ ప్రాంతాల్లో 3కోట్ల గృహ నిర్మాణాన్ని సాధించాం. వచ్చే రెండేళ్లలో మరో 2కోట్ల గృహ నిర్మాణాలు అందిస్తాం
కోటి ఇళ్లలో సౌర విద్యుత్ ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.
వచ్చే ఐదేళ్లలో ఊహించని రీతిలో అభివృద్ధి జరుగుతుంది.. స్వర్ణయుగం కానుంది.
భవిష్యత్ సంస్కరణలు తీసుకురానున్నాం.
4.50 కోట్ల మందికి బీమా సౌకర్యం కల్పించాం
దేశంలోని అన్ని ప్రాంతాలు ఆర్థికాభివృద్ధిలో భాగం అయ్యాయి.
జీఎస్టీ ద్వారా ఒక దేశం ఒక పన్ను విధానాన్ని అమలు చేస్తున్నాం.
అంతర్జాతీయ పరిణామాలు సంక్లిష్టంగా మారాయి.
కోవిడ్ వల్ల ఎన్నో దేశాలు తీవ్ర సమస్యలు ఎదుర్కోగా.. భారత్ విజయవంతంగా అధిగమించింది.
రాష్ట్రంలో, జిల్లాల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపర్చడానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లో మూడు కోట్ల గృహ నిర్మాణాన్ని సాధించాం.
నానో యూరియా విజయవంతం కావడంతో.. నానో డీఏపీ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాం.
మత్స్య సంపద ప్రోత్సాహానికి ప్రత్యేక శాఖ .
బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంతింటి కలను నరవేరుస్తాం.
ఇంటి నిర్మాణానికి, కొనుగోలుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది.
ఆశాలు, అంగన్ వాడీలకు ఆయుష్మాన్ పథకం వర్తింపు
9 నుంచి 14ఏళ్లలోపుబాలికలకు వ్యాక్సినేషన్ ద్వారా గర్భాశయ క్యాన్సర్ నివారణకు చర్యలు.
ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పు లేదు.
ఎగుమతి, దిగుమతి సుంకాల్లో ఎలాంటి మార్పులు లేవు.
ద్రవ్యోల్బణం అదుపులో ఉంది.
ప్రజల ఆదాయం 50శాతం వృద్ధి చెందింది.
దేశంలో అన్ని ప్రాంతాలు ఆర్థికాభివృద్ధిలో భాగం అయ్యాయి.
జీఎస్టీ ద్వారా ఒక దేశం ఒక పన్ను విధానాన్ని అమలు చేస్తున్నాం.
ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పు లేదు.
పదేళ్లలో ఎన్నో పన్నుల సంస్కరణలు చేపట్టాం.
జీఎస్టీ పన్ను విధానం వల్ల వ్యాపార, పారిశ్రామిక రంగాలు పూర్తి సంతృప్తిగా ఉన్నాయి.
ముగిసిన ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం.
57 నిమిషాల పాటు సాగిన బడ్జెట్ ప్రసంగం.
రేపటికి వాయిదా పడిన లోక్ సభ సమావేశాలు