మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు 2019, డిసెంబర్ 04వ తేదీ బుధవారం తీర్పు వెలువరించనుంది. నవంబర్ 28వ తేదీన విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి..జస్టిస్ ఆర్.భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి సుప్రీంకోర్టును చిదంబరం ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కానీ ఆయనకు చుక్కెదురైంది. ఆయన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో చిదంబరం సుప్రీం తలుపులు తట్టారు.
> మీడియా కంపెనీ ఐఎన్ఎక్స్‌పై 2017 మే 15న సిబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
> ఫారెన్స్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ ఎన్నో అవతవకలకు పాల్పడిందని ఆరోపించింది.
పెట్టుబడులు ఆమోదించిన సమయంలో పి.చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు.
> జరగబోయే దర్యాప్తును అడ్డుకోవడానికి యత్నించారని పి.చిదంబరం కొడుకు కార్తీ చిదంబరంపై ఆరోపణలు వచ్చాయి.
> గత ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ కార్తీని అరెస్టు చేసింది.
> భారత్, యూకే, స్పెయిన్ దేశాల్లో కార్తీ చిదంబరానికి రూ. 54 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది.
> మనీ ల్యాండరింగ్ కేసు కూడా నమోదు చేశారు. దీనిపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
> చిదంబరాన్ని పలుమార్లు విచారించింది ఈడీ.
> చిదంబరానికి కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు మద్దతు ప్రకటించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందునే..ఆయనపై కక్ష గట్టి కేంద్రం వేధిస్తోందని నేతలు ఆరోపించారు.
> కాంగ్రెస్ చేసిన కక్ష సాధింపు వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తోంది.
Read More : SBI కస్టమర్లకు ఝులక్ : డిసెంబర్ 31 తర్వాత కార్డులు చెల్లవు!