iPhone mini :ఆపిల్ ఐఫోన్ ప్రేమికుల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. ఎంతోగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్ ఐఫోన్ 12 (iPhone 12)ను విడుదల చేసింది ఆపిల్ సంస్థ. ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్రయోగ కార్యక్రమంలో ఆపిల్ సంస్థ iPhone 12 Mini నుంచి రెండు iPhone 12 Pro మోడల్స్.. iPhone 12 Pro, iPhone 12 Pro Maxలు రిలీజ్ అయ్యాయి.
హై స్పీడ్ అనే పేరుతో స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆపిల్ కొత్త లైనప్ ఐ ఫోన్‌లు, చిన్న హోమ్‌పాడ్ స్మార్ట్ స్పీకర్, ఓవర్ ఇయర్ హెడ్‌ఫోన్స్, సరికొత్త ఆపిల్ టీవీ స్ట్రీమింగ్ బాక్స్, టైల్ లాంటి లొకేషన్ ట్రాకింగ్ పరికరాన్ని కూడా విడుదల చేసింది. ‘హై స్పీడ్’ ట్యాగ్‌లైన్ ఇవ్వడంతో హై-స్పీడ్‌కు మద్దతుగా 5జీ కనెక్టివిటీతో ఈ ఫోన్లను లాంచ్ చేసింది.
ప్రధానంగా తరువాతి తరం ఐఫోన్ “ఐఫోన్ 12” సిరీస్ పై అందరి ఆసక్తి నెలకొని ఉంది. ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12, ఐఫోన్ 12 మాక్స్, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్ మోడళ్లను లాంచ్ చేసింది.
అక్టోబరు 30నుంచి మొదలుకానున్న వీటి అమ్మకాల వివరాలు ఇలా ఉన్నాయి. iPhone 12 Proధర రూ.1లక్షా 19వేల 900, iPhone 12 Pro Max ధర రూ.1లక్షా 29వేల 900గా ఉంది. iPhone 12 Mini ధర రూ.69వేల 900గా ఉండగా iPhone 12 ధర రూ.79వేల 900గా ఉంది.