‘పరీక్షల్లో మీకు తెలియని ప్రశ్న వస్తే రాయకుండా ఖాళీగా వదిలేయండి.. నేను రాస్తా’ అని చెప్పి రూ.10 లక్షల చొప్పున తీసుకున్న టీచర్

ఆ పరీక్ష కేంద్రంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా తుషార్ భట్‌గా అనే ఫిజిక్స్ టీచర్‌ బాధ్యతల్లో ఉన్నాడు.

‘పరీక్షల్లో మీకు తెలియని ప్రశ్న వస్తే రాయకుండా ఖాళీగా వదిలేయండి.. నేను రాస్తా’ అని చెప్పి రూ.10 లక్షల చొప్పున తీసుకున్న టీచర్

NEET - UG

‘‘నీట్ యూజీ పరీక్షల్లో మీకు తెలియని ప్రశ్న ఏదైనా వస్తే సమాధానం రాయకుండా ఖాళీగా వదిలేయండి. మీరు జవాబు పత్రాలను ఇచ్చి వెళ్లిపోయాక ఆ ఆన్సర్లు మేము రాస్తాం’’ అని చెప్పాడో టీచర్. అలా చేయడానికి గానూ కొందరు నీట్ యూజీ అభ్యర్థుల నుంచి రూ.10 లక్షల చొప్పున తీసుకున్నాడు. ఈ రాకెట్‌ను ఛేదించిన పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.

గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలోని గోద్రాలో ఓ స్కూల్ టీచర్‌తో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. కొందరు వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. గోద్రా పాఠశాలలో నీట్-యూజీ పరీక్ష కేంద్రంలో విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. పోలీసులు ఆ పరీక్ష కేంద్రానికి వెళ్లారు.

ఆ పరీక్ష కేంద్రంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా తుషార్ భట్‌గా అనే ఫిజిక్స్ టీచర్‌ బాధ్యతల్లో ఉన్నాడు. అతడు మరో ఇద్దరు వ్యక్తులు పరశురామ్ రాయ్, అరిఫ్ వోరాతో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఒక నీట్ అభ్యర్థి వోరాకు అడ్వాన్స్‌గా రూ.7 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బును తుషార్ కు వోరా అందించాడు. తుషార్ భట్ కారులో ఆ రూ.7 లక్షలు పోలీసులకు దొరికాయి. జై జలరామ్ పాఠశాలలో తుషార్ భట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.

UPSC 2023 : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2023 ఆన్సర్ కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!