Viral Video : రోడ్డుపై రొమాన్స్.. అమ్మాయిని ఒడిలో కూర్చొబెట్టుకుని బైకు నడుపుతూ.. వైరల్ వీడియో!

Viral Video : బెంగుళూరులోని ఓ ఫ్లై ఓవర్‌పై ఒక యువకుడు తన ఒడిలో ఒకవైపు మహిళను కూర్చొని ఆమె చేతులు మెడకు చుట్టుకుని ప్రమాదకరంగా బైక్ నడుపుతూ కెమెరాకు చిక్కాడు.

Viral Video : రోడ్డుపై రొమాన్స్.. అమ్మాయిని ఒడిలో కూర్చొబెట్టుకుని బైకు నడుపుతూ.. వైరల్ వీడియో!

Bengaluru man rides bike with woman ( Image Credit : Screenshot Grab From Video )

Updated On : May 19, 2024 / 7:54 PM IST

Viral Video : రోడ్డుపై రొమాన్స్.. ఇప్పుడు ఇదో ఫ్యాషన్‌గా అయిపోయింది. అమ్మాయిని బైక్‌పై కూర్చొబెట్టుకుని రైడ్ చేయడం.. బైక్ ట్యాంకర్‌పై అమ్మాయిని ‌కూర్చుబెట్టుకోవడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. లేటెస్టుగా బెంగుళూరులోని ఓ ఫ్లై ఓవర్‌పై ఒక యువకుడు తన ఒడిలో ఒకవైపు మహిళను కూర్చొని ఆమె చేతులు మెడకు చుట్టుకుని ప్రమాదకరంగా బైక్ నడుపుతూ కెమెరాకు చిక్కాడు.

బైక్ నంబర్ ప్లేట్, సీసీటీవీ విజువల్స్ ఆధారంగా పోలీసులు వీరిద్దరిని గుర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోను గమనించిన పోలీసులు వారిద్దరి గురించి విచారిస్తున్నారు.

మహిళ బైకర్ ఒడిలో ఒకవైపు కూర్చొని అతని మెడ చుట్టూ చేతులు చుట్టి ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఉత్తర బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్‌పై ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు బైక్ నంబర్ ప్లేట్, సీసీటీవీ విజువల్స్ ఆధారంగా బైకు నడిపిన యువకుడు, మహిళను గుర్తించారు. ‘‘మేం నేరస్థుడిని గుర్తించాం. ఇంతకు ముందు అతడు చేసిన ఉల్లంఘనల జాబితాను ట్రేస్ చేస్తాం’’ అని బెంగళూరు ట్రాఫిక్ నార్త్ డీసీపీ చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also : Porsche Car : లగ్జరీ పోర్స్చే కారుతో బైకును ఢీకొట్టిన మైనర్.. ఇద్దరు దుర్మరణం