Bharath Darshan : ఈ నెల 29 నుంచి ఐఆర్‌సీటీసీ ‘భారత్‌ దర్శన్‌’

దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, భక్తిపూర్వక ప్రదేశాలను దర్శించుకోవడానికి వీలుగా ఐఆర్‌సీటీసీ ‘భారత్‌ దర్శన్‌’ పేరుతో ప్రత్యేక పర్యటన కార్యక్రమాన్ని చేపట్టింది. ఆగస్టు 29 నుంచి వచ్చే సెప్టెంబర్10వ తేదీ వరకు కొనసాగే ఈ యాత్రలో దేశంలోని వివిధ చారిత్రాత్మక, భక్తిపూర్వక ప్రాంతాల్లో పర్యటించవచ్చు.

Bharath Darshan : దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, భక్తిపూర్వక ప్రదేశాలను దర్శించుకోవడానికి వీలుగా ఐఆర్‌సీటీసీ ‘భారత్‌ దర్శన్‌’ పేరుతో ప్రత్యేక పర్యటన కార్యక్రమాన్ని చేపట్టింది. ఆగస్టు 29 నుంచి వచ్చే సెప్టెంబర్10వ తేదీ వరకు కొనసాగే ఈ యాత్రలో దేశంలోని వివిధ చారిత్రాత్మక, భక్తిపూర్వక ప్రాంతాల్లో పర్యటించవచ్చు. 11 రాత్రులు/12 పగల్లు ఉండే ఈ ప్యాకేజీలో పెద్దవారికి రూ.11,340కి అందిస్తున్నారు. ఈ టూర్ కోసం ఇండియన్ రైల్వేస్ ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఈ ప్రత్యేక పర్యటనలో హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్‌, భావ్‌నగర్‌లోని నిష్కలంక్‌ మహాదేవ్‌ సీ టెంపుల్‌, అమృత్‌సర్‌, జైపూర్‌, స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ వంటి ప్రదేశాలను చేర్చారు.

ఈ ప్రత్యేక టూర్‌కు వెళ్లే వారికి ట్రావెల్‌ ఇన్సురెన్స్‌తోపాటు శానిటైజేషన్‌ కిట్‌ను అందజేస్తారు. ఇక ఈ పర్యటనకు వెళ్ళాలి అనుకునే వారు టిక్కెట్లను బుక్‌ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఐఆర్‌సీటీసీ జోనల్‌, రీజనల్‌ కార్యాలయాల్లో కూడా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక రైళ్లలో శాకాహార భోజనం అందిస్తారు. ఈ పర్యటనలో స్లీపర్‌ క్లాస్‌ టికెట్‌తోపాటు కూరగాయల భోజనం, నాన్‌ ఏసీ ట్రాన్స్‌పోర్ట్‌, హాల్‌ అకామడేషన్‌ వంటి సౌకర్యాలు కల్పిస్తారు.

ఈ ప్రత్యేక పర్యటనకు వెళ్లేవారికి ట్రావెల్ ఇన్సూరెన్స్ తోపాటు శానిటైజేషన్ కిట్ ను అందిస్తారు. వెళ్ళాలి అనుకునే వారు ప్రయాణం ప్రారంభానికి 48 గంటలు ముందుగా కొవిడ్ వ్యాక్సినేషన్‌ తీసుకున్నట్లు ధ్రువీకరణపత్రాన్ని అందజేయాలి. మధురై, సేలం, దిండిగల్‌, ఈరోడ్‌, జోనారిపెట్టై కరూర్‌, ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌, నెల్లూరు, విజయవాడల్లో బోర్డింగ్‌ పాయింట్లు, విజయవాడ, నెల్లూరు, పెరంబూర్‌, కాట్పాడి, జోలారిపెట్టై , సేలం, ఈరోడ్‌, కరూర్‌, దిడిగల్‌, మధురైలలో డీ-బోర్డింగ్‌ పాయింట్లు ఏర్పాటుచేశారు

ట్రెండింగ్ వార్తలు