ఇరోమ్ షర్మిలకు కవల పిల్లలు

  • Publish Date - May 13, 2019 / 02:13 AM IST

మదర్ డే రోజున..మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలకు కవల పిల్లలు జన్మించారు. ఈ విషయాన్ని ఆమెకు సన్నిహితురాలైన ఓ సామాజిక కార్యకర్త దివ్యభారతి సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. తమిళనాడులోని కొడైకెనాల్‌కు సమీపంలో ఈమె నివాసం ఉంటున్నారు. 2017 ఆగస్టులో డేస్‌మోండ్ అంథోని బెల్మార్మిన్ అనే వ్యక్తిని ఈమె వివాహం ఆడారు. కొడైకెనాల్‌లోని ఓ ఆసుపత్రిలో షర్మిల జాయిన్ అయ్యారు. మే 12వ తేదీ ఆదివారం కవలలకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారని దివ్య భారతి తెలిపారు. 

ఇరోమ్ షర్మిల ఉక్కు మహిళగా పేరొందారు. మణిపూర్ రాష్ట్రంలో భద్రతా దళాలకు ప్రత్యేక అధికారం అందించే చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ 16 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. 2000 సంవత్సరం ఈ పోరాటాన్ని కొనసాగించారు ఆమె. కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే నాజల్ ట్యూబ్ ద్వారా ఆమె ఆహారంగా తీసుకున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఈమె పార్టీ స్థాపించి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఈమె ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు