Gas and Petrol Shortage : నిన్న గ్యాస్ సంక్షోభం.. ఇప్పుడు పెట్రోల్ పాట్లు.. రేపు రాబోయే సంక్షోభాలు ఇవే.. ఇప్పుడే నిల్వ చేసుకోండి..

Gas and Petrol Shortage : పశ్చిమాసియాలో ఉధ్రిక్తతలు క్రమంగా తీవ్రరూపం దాల్చుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. ఈ పరిణామం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది.

Gas and Petrol Shortage

Gas and Petrol Shortage : ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సైన్యం వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా ఇరాన్‌సైతం ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను నేలమట్టం చేస్తోంది. ఈ యుద్ధం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. ఈ పరిణామం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది.

Also Read : Petrol Shortage : నిజంగానే పెట్రోల్ కొరత ఉందా..? ఎందుకు నో స్టాక్ బోర్డులు.. అసలు విషయం చెప్పిన తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్

భారత్ పెద్ద మొత్తంలో క్రూడాయిల్, గ్యాస్, ఎరువులు వంటి ఎన్నో నిత్యావసరాలను హర్ముజ్ జలసంధి మీదుగానే తరలిస్తుంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి హర్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు తీవ్ర సవాళ్లు ఎదువుతున్నాయి. అయినప్పటికీ, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాలపై పెద్దగా ప్రభావం పడకుండా కేంద్రం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది. కానీ, యుద్ధం తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే భారత దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత వేదిస్తోంది. ఎల్పీజీ గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో గ్యాస్ సిలిండర్ కోసం ఏజెన్సీల వద్ద ప్రజలు పడిగాపులుకాస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే, మిడిల్‌ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధంపై సోమవారం లోక్‌సభలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. భారత్ కూడా ఊహించని సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. ఈ సంఘర్షణ ప్రభావం సుదీర్ఘకాలం ఉండనుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ప్రధాని పేర్కొన్నారు.

పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం ఇలానే కొనసాగితే గ్యాస్ ధరలతోపాటు, పెట్రోల్, డీజిల్ ధరలు, యూరియా, ఎఫ్ఎంసీజీ గూడ్స్, నిత్యావసరాల ధరలు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెట్రోల్ సరఫరా నిలిచిపోవటంతో బంక్‌లు మూతపడుతున్నాయి. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రానున్న రోజుల్లో పెట్రోల్ కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే రవాణా చార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంపోర్ట్స్ మందగిండం వల్ల నిత్యావసర వస్తువుల ధరల నుంచి అన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.

గ్యాస్ కొరతతోపాటు.. ప్రస్తుతం పెట్రోల్ ఇబ్బందులు మొదలయ్యాయి. పెట్రోల్ కోసం బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చితే రవాణా ఛార్జీలు  భారీగా పెరగడంతోపాటు.. ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. అన్ని రంగాలకు సంబంధించిన వస్తువులపై ఈ ప్రభావం పడుతుంది. మరోవైపు ఇంకో సంక్షోభం పొంచి ఉంది.

ఇంటర్నెట్ సంక్షోభం వచ్చినా రావొచ్చనే ఆందోళనలు ఉన్నాయి. హార్ముజ్ జలసంధి నుంచి గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీలు పెద్ద ఎత్తున ఇంటర్నెట్ కేబుల్స్ వేశాయి. గ్లోబల్ ఇంటర్నెట్ సరఫరాలో సుమారు 17శాతం ఈ లైన్‌లోనే ఉంది. సౌదీ, యూఏఈల్లో పెద్ద ఎత్తున డేటా సెంటర్లు నడుస్తున్నాయి. ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేస్తామని గతంలో ఇరాన్ ప్రకటించింది. ఈ యుద్ధం ఇలానే కంటిన్యూ అయితే ఇరాన్ అన్నంత పనిచేయొచ్చు. అప్పుడు గ్లోబల్ ఔటేజ్ ఏర్పడుతుంది. ఇంటర్నెట్ సంక్షోభం, డేటా సెంటర్లు పడిపోయే అవకాశం ఉంది.

పశ్చిమాసియాలో యుద్ధం మరికొద్ది నెలలు ఇలానే కొనసాగితే భారతదేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతతోపాటు వ్యవసాయ ఆధారిత ఎరువుల ధరలు, పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలు  భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇంట్లో నిత్యం వాడు నిత్యావసర వస్తువులను రెండు, మూడు నెలలకు సరిపడా ఇప్పుడే తెచ్చిపెట్టుకోవటం మంచిదని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.