ISRO: అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ వల్లే అలా జరిగింది.. డాకింగ్ ప్రక్రియకు మరోవారం : ఇస్రో చైర్మన్ సోమనాథ్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్షంలో అద్భుతం చేసింది. పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ నుంచి రెండు చిన్న అంతరిక్ష నౌకలను విజయవంతం ప్రయోగించింది

ISRO Chairman Somnath

ISRO PSLV-C60 Spadex Space Launch: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్షంలో అద్భుతం చేసింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ నుంచి రెండు చిన్న అంతరిక్ష నౌకలను విజయవంతం ఇస్రో ప్రయోగించింది. సోమవారం రాత్రి 10గంటల 15 సెకన్లకు పీఎస్ఎల్వీ సీ-60 నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం విజయవంతం కావడంతో కొత్త ఏడాదిలోకి ఇస్రో విజయంతో అడుగుపెట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది. ఈ రెండు చిన్న ఉపగ్రహాల సాయంతో అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించడమే స్పెడెక్స్ మిషన్ లక్ష్యం.

Also Read: Richest CM: దేశంలోనే రిచ్చెస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు.. అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రి ఎవరంటే?

శాస్త్రవేత్తలను అభినందించిన ఇస్రో చైర్మన్ ..
ప్రయోగం విజయవంతం అనంతరం శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ సోమనాథ్అ భినందించారు. పీఎస్ఎల్వీ సీ60 ద్వారా స్సేస్ డాకింగ్ సాంకేతికను మనం సొంతం చేసుకుంటున్నామని తెలిపారు. ఉమ్మడి మిషన్ లక్ష్యాలు చేరుకోవడానికి బహుళ రాకెట్ ప్రయోగాలు అవసరమైనప్పుడు అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికత చాలా అవసరం. ఈ సాంకేతికత ఇప్పటికే రష్యా, చైనా, అమెరికా దేశాల వద్ద ఉంది. ప్రస్తుతం భారతదేశం కూడా ఆ జాబితాలో చేరుతుందని తెలిపారు. చంద్రయాన్-4 భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం, నిర్వహణ, భారత అంతరిక్ష ఆశయాలకు ఈ సాంకేతికత ఎంతో అవసరమని సోమనాథ్ వెల్లడించారు.

Also Read: Tirumala : తిరుమల శ్రీవారి దర్శనాలపై సీఎం రేవంత్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ..

2025లో జీఎస్ఎల్వీ ప్రయోగం..
పీఎస్ఎల్వీ సీ-60 ద్వారా ఛేజర్, టార్గెట్ శాటిలైట్స్ ను కక్ష్యలో ప్రవేశపెట్టడం ద్వారా స్పేస్ డాకింగ్ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది అయితే, ప్రస్తుతం 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ఉపగ్రహాలను వారంరోజుల వ్యవధిలో దగ్గరికి తీసుకొస్తామని ఇస్రో అధిపతి సోమనాథ్ తెలిపారు. జనవరి 7వ తేదీ నుంచి అవి పనిచేస్తాయని అంచనా వేస్తున్నామని చెప్పారు. షార్ నుంచి ఇప్పటి వరకు 99 ప్రయోగాలు చేపట్టామని, 2025 సంవత్సరంలో జీఎస్ఎల్వీ ప్రయోగం చేపట్టనున్నామని సోమనాథ్ తెలిపారు.

Also Read: Spadex Mission : ఇస్రో స్పేడెక్స్ ప్రయోగం విజయవంతం..

ట్రాఫిక్ జామ్ వల్లే ఆలస్యం..
శ్రీహరికోట నుంచి ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ60 రాకెట్ ను వాస్తవానికి సోమవారం రాత్రి 9.58గంటలకు ప్రయోగించాల్సి ఉంది. అయితే, ముందుగా నిర్దేశించిన ఈ సమయాన్ని మార్పు చేశారు. రాత్రి 10.15 సెకన్లకు పీఎస్ఎల్వీ సీ60 నింగిలోకి దూసుకెళ్లింది. అయితే, ప్రయోగం ఆలస్యం కావటానికి కారణాలపై ఇస్రో చైర్మన్ స్పందించారు. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ కారణంగానే ప్రయోగం ఆలస్యమైందని పేర్కొన్నారు. సరిగ్గా రాకెట్ వెళ్లాల్సిన కక్ష్యలోనే ఇతర ఉపగ్రహాలు అనుసంధానం చెందడంతో ఈ పరిస్థితి తలెత్తిందని, అయితే, గతంలోనూ చంద్రయాన్ -3 ప్రయోగం సమయంలో ఇలాంటి సమస్య ఎదురైందని ఇస్రో చైర్మన్ తెలిపారు. స్టార్ లింక్ కు చెందిన కొన్ని ఉపగ్రహాలు ఈ దారిలో వస్తున్నట్లు ఇస్రో నిపుణులు గుర్తించారని, ఈ కారణంగా ప్రయోగం అనుకున్న సమయం కంటే ఆలస్యంగా చేయాల్సి వచ్చిందని ఇస్రో చైర్మన్ తెలిపారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం స్టార్ లింక్ కు సముదాయానికి చెందిన ఏడువేల ఉపగ్రహాలు భూమి కక్ష్యలో దిగువ భాగంలో ఉన్నాయి. ఇవి అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ కు కారణమవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇస్రో శాస్త్రవేత్తలకు చంద్రబాబు, లోకేశ్ అభినందనలు..
పీఎస్ఎల్వీ సీ60 రాకెట్ ప్రయోగం విజయవంతం కావటం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రో మరో ఘనత సాధించిందని, పీఎస్ఎల్వీ సీ-60 ప్రయోగం అంతరిక్ష పరిశోధన రంగంలో భారతదేశ ప్రతిష్టను చాటి చెప్పిందని చంద్రబాబు కొనియాడారు. ఈ విజయంతో ఇస్రో ట్రేడ్ మార్క్ లా మారడం దేశానికే గర్వకారణమని లోకేశ్ అన్నారు.