ISRO : నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్.. ప్రయోగం విజయవంతం

శ్రీహరికోటలోని షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో చేపట్టిఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్ -08 ఉపగ్రహాన్ని

ISRO SSLV-D3-EOS8 Mission Launch

ISRO SSLV-D3-EOS8 Mission Launch : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీహరికోటలోని షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఉదయం 9.17గంటలకు ఇస్రో ఈ ప్రయోగాన్ని ప్రారంభించింది. ఇస్రో చేపట్టి ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్ -08 ఉపగ్రహాన్ని ఎస్ఎస్ఎల్వీ -డీ3 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగం మొత్తం 17 నిమిషాలపాటు సాగింది. అనంతరం కక్ష్యలోకి ప్రవేశించడంతో ప్రయోగం విజయవంతం అయిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీంతో శాస్త్రవేత్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒకరినొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలను అభినందించారు.

కక్ష్యలోకి ప్రవేశించిన ఈవోఎస్-08 ఉపగ్రహంలోఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ (ఈవోఐఆర్) పేలోడ్ మిడ్-వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రా రెడ్ లో చిత్రాలను క్యాప్చర్ చేయనున్నాయి. ఈ ప్రయోగం ద్వారా విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. పర్యావరణం, ప్రకృతి విపత్తులను పర్యవేక్షణ చేయనుంది.

 

 

ట్రెండింగ్ వార్తలు