It is a good thing says Tejashwi on Nitish recent meetings with Opposition leaders
Opposition Unity: విపక్షాలు అన్నీ ఏకమైతే వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమని బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని విపక్షాలన్నింటినీ ఏకం చేయడానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగానే నితీశ్ వ్యవహరిస్తున్నారని, ఇప్పుడు ఏది అవసరమో అదే చేస్తున్నాయని తేజశ్వీ అన్నారు.
దేశంలోని విపక్ష నేతలను వరుస పెట్టి కలుస్తున్నారు సీఎం నితీశ్. అయితే ఈ విషయమై శుక్రవారం తేజశ్వీని ప్రశ్నించగా.. ‘‘ఇది చాలా మంచి పరిణామం. విపక్షాలన్నీ ఏకమైతే బీజేపీని ఓడించడం పెద్ద పనేం కాదు. ఐక్యతతో ఉంటే వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయం. చాలా సందర్భాల్లో విపక్షాల ఐక్యత వల్ల బీజేపీ ఓడిపోయింది. ఎక్కడైతే విపక్షాలు ఒంటరిగా వెళ్లాయో అక్కడ బీజేపీ గెలిచింది. ఇప్పుడు దేశానికి ఏం కావాలో నితీశ్ అదే చేస్తున్నారు. ఆయన చేస్తున్న పనిని స్వాగతిస్తున్నా. నా పూర్తి మద్దతు నితీశ్‌కు ఉంటుంది’’ అని అన్నారు.
కాగా, కొద్ది రోజుల క్రితం నితీశ్ మాట్లాడుతూ విపక్షాలు అంతా ఏకమైతే బీజేపీకి కేవలం 50 స్థానాలు మాత్రమే వస్తాయని అన్నారు. ఇంకో అడుగు ముందుకేసి 1984 నాటి పరిస్థికి బీజేపీ వెళ్తుందని కూడా అన్నారు. బీజేపీ ఏర్పడ్డ అనంతరం పోటికి దిగిన మొట్టమొదటి ఎన్నికలు అయిన 1984లో రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. 30 ఏళ్లలో రెండు స్థానాల నుంచి 303 స్థానాలకు ఎదిగిన బీజేపీ.. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద పార్టీ. ప్రస్తుతం ఆ పార్టీకి 35 శాతం ఓట్ బ్యాంక్ ఉంది. ఈ లెక్కన మరో 20 ఏళ్లు ఆ పార్టీని కదిలించడం కష్టమేనని ఓ సందర్భంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు.
Bilkis Bano case: గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు