Bilkis Bano case: గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

ఈ కేసులో గత నెలలోనే కేంద్రం ప్రభుత్వం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 11 మంది నిందితుల రిలీజ్ గురించి వివ‌ర‌ణ ఇవ్వాలంటూ ప్ర‌భుత్వానికి ఈ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 15 రోజున బిల్కిస్ బానో రేప్ కేసులో నిందితులుగా ఉన్న 11 మందిని గుజ‌రాత్ ప్ర‌భుత్వం విడుదల చేసింది. కాలం చెల్లిన రెమిష‌న్ విధానం ప్ర‌కారం వారిని రిలీజ్ చేసింది. దీనిపై దేశ‌వ్యాప్తంగా దుమారం రేగుతోంది.

Bilkis Bano case: గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

SC asks Gujarat govt to furnish remission order and record of proceedings in Bilkis Bano case

Bilkis Bano case: బిల్కిస్ బానో అత్యాచార కేసులోని నేరస్తులు విడుదలపై దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. తాజాగా దీనిపై సుప్రీంకోర్టు కూడా స్పందించడం గమనార్హం. వారిని విడుదల చేయడానికి ఉపయోగించిన రెమిషన్ ఆర్డర్‭తో పాటు ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను తమ ముందు సమర్పించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందు కోసం గుజరాత్ ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తున్నట్లు సుప్రీం పేర్కొంది. తదుపరి విచారణను మూడు వారాలకు కోర్టు వాయిదా వేసింది.

ఈ కేసులోని నేరస్తులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మహువా మోయిత్రా సహా మరొకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‭పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యానించింది. గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారం చేసిన 11 మంది నేరస్తులను దేశ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. రెమిషన్ పాలసీ కింద వారిని విడుదల చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. కాలం చెల్లిన రెమిష‌న్ విధానం ప్ర‌కారం వారిని రిలీజ్ చేసింది. దీనిపై దేశ‌వ్యాప్తంగా దుమారం రేగుతోంది.

Mayawati: ముస్లింలను వేధించే రాజకీయ క్రీడ అంతరాయం లేకుండా సాగుతోంది.. బీఎస్పీ చీఫ్ మాయావతి

గుజ‌రాత్ ప్ర‌భుత్వ తీరును విప‌క్షాలతో పాలు పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అత్యాచార నిందితులకు ఇప్పటి వరకు శిక్ష పడకపోగా పైగా వారిని విడుదల చేయటమా? అని నిల‌దీస్తున్నారు. ఈ క్రమంలో దాఖ‌లైన పిటిష‌న్ల‌ను విచారించిన సుప్రీంకోర్టు.. నిందితుల విడుద‌ల గురించి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని గుజ‌రాత్ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. 2002లో గుజ‌రాత్ అల్ల‌ర్ల స‌మ‌యంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు పలువురు. ఆ కేసులో 11 మంది నిందితులుగా ఉన్నారు. బాధితురాలు తనకు జరిగిన ఘోరంపై పోరాటం చేసినా ఫలితం దక్కకుండాపోయింది. పైగా అత్యాచార నిందితులను విడుదల చేయటం అత్యంత హేయం అని మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.

Marital rape: వైవాహిక అత్యాచారాలపై ఈనెల 16న సుప్రీం విచారణ