Marital rape: వైవాహిక అత్యాచారాలపై ఈనెల 16న సుప్రీం విచారణ

ఐసీపీ సెక్షన్ 375 (అత్యాచారం/రేప్) కింద వైవాహిక అత్యాచారం మినహాయింపుపై రాజ్యాంగబద్ధతను పిటిషన్లు సవాల్ చేశారు. వివాహిత తన భర్త చేతిలో అత్యాచారానికి గురైతే ఇది వివాహిత మహిళల పట్ల వివక్ష చూపుతుందని పిటిషనర్లు వాదించారు. అయితే సెక్షన్ 375లో మినహాయింపు ప్రకారం.. ఒక వ్యక్తి తన భార్యతో లైంగిక సంబంధం కలిగి ఉండవచ్చు. ఒక వేళ భార్య మైనర్ కాకపోతే ఇది అత్యాచారం కిందకు రాదని ఉంది

Marital rape: వైవాహిక అత్యాచారాలపై ఈనెల 16న సుప్రీం విచారణ

SC to hear pleas on marital rape on september 16

Marital rape: వైవాహిక అత్యాచారం.. ఆ మధ్య దేశంలో తీవ్రంగా చర్చ జరిగిన అంశాల్లో ఇది ప్రధానమైంది. దీనిపై దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వైవాహిక అత్యాచారమనేదే ఉండదంటూ సంప్రదాయవాదులు బలంగా వాదించగా.. ఈ విషయంపై చర్చ జరగాల్సిందేనంటూ ఉదారవాదులు అంతే ఘాటుగా స్పందించారు. నిజమే.. భారతీయ సంప్రదాయ వ్యవస్థ నుంచి చూసినప్పులు ఈ మాట కొంచెం ఎబ్బెట్టుగా, ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ వైవాహిక అత్యాచారం కూడా ఉంటుంది. చాలా దేశాలు ఈ విషయాన్ని అంగీకరించాయి. దీనిపై చట్టాలు కూడా చేశాయి.

ఈ విషయమై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సందర్భంలో ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇద్దరు సభ్యులతో కూడిన బెంచ్ చేపట్టిన విచారణలో విచిత్రంగా అచ్చంగా ప్రజల నుంచి వచ్చిన భిన్న తీర్పులే వెలువడ్డాయి. భారత శిక్షాస్మృతి అమలులోకి వచ్చి 162 ఏళ్లైన తర్వాత కూడా న్యాయం కోసం అభ్యర్థిస్తున్న మహిళ పిలుపు వినబడకపోతే అంతకంటే విషాధకరం ఇంకొకటి ఉండదని ఒక న్యాయమూర్తి వ్యాఖ్యానించగా.. అత్యాచార చట్టాల్లో భార్యాభర్తలకు మినహాయింపులు రాజ్యాంగ విరుద్ధం కాదని మరొక న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

Ghulam Nabi Azad: కాంగ్రెస్ నామీద మిసైల్స్ వేసింది, జస్ట్ రైఫిల్‭తో వాటిని ధ్వంసం చేశాను.. అదే నేను బాలిస్టిక్ మిసైల్ తీసుంటే?

దీంతో ఎటూ చేసేది లేక ఈ విషయమై అవసరమైతే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చని ఢిల్లీ హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. కాగా, ఈ కేసుపై దాఖలైన రెండు పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి. ఈ పిటిషన్లను పరిశీలించిన జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం.. ఈ నెల 16న నుంచి విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది.

ఐసీపీ సెక్షన్ 375 (అత్యాచారం/రేప్) కింద వైవాహిక అత్యాచారం మినహాయింపుపై రాజ్యాంగబద్ధతను పిటిషన్లు సవాల్ చేశారు. వివాహిత తన భర్త చేతిలో అత్యాచారానికి గురైతే ఇది వివాహిత మహిళల పట్ల వివక్ష చూపుతుందని పిటిషనర్లు వాదించారు. అయితే సెక్షన్ 375లో మినహాయింపు ప్రకారం.. ఒక వ్యక్తి తన భార్యతో లైంగిక సంబంధం కలిగి ఉండవచ్చు. ఒక వేళ భార్య మైనర్ కాకపోతే ఇది అత్యాచారం కిందకు రాదని ఉంది. అయితే భర్తలకు ఇచ్చిన ఈ మినహాయింపును కొట్టివేయాలని కోరుతూ ఆర్ఐటీ ఫౌండేషన్, ఆల్ ఇండియా డెమొక్రటిక్ వుమెన్స్ అసోసియేషన్‭లతో పాటు మరో ఇద్దరు కోర్టును ఆశ్రయించారు.

Mayawati: ముస్లింలను వేధించే రాజకీయ క్రీడ అంతరాయం లేకుండా సాగుతోంది.. బీఎస్పీ చీఫ్ మాయావతి