Congress MP Dheeraj Sahu
IT Raids at MP Dheeraj Sahu’s Residences : ఒడిశా, జార్ఖండ్‌లోని కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు నివాసాల్లో శనివారం ఇన్ కమ్ ట్యాక్స్ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు లెక్కలు చూపని రూ. 200 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం (డిసెంబర్ 6) నుంచి ఐటీ దాడులు దాడులు ప్రారంభమయ్యాయి. తాజాగా ఐటీ అధికారులు రాంచీలోని ధీరజ్ సాహు నివాసంలో మరో మూడు బ్యాగుల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ ప్రాంతాల్లోని మద్యం ఫ్యాక్టరీల నిర్వహణ ఇన్‌ఛార్జీ బంటీ సాహు ఇంట్లో దాదాపు 19 బ్యాగుల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలో దాడులు కొనసాగుతున్నాయి.
బంటీ సాహు ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ. 20 కోట్లు పైగా ఉందని, స్వాధీనం చేసుకున్న డబ్బును ఒడిశా బలంగీర్‌లోని సుద్పారాలోని బ్యాంకులకు తరలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తాము రెండు రోజుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం డబ్బును లెక్కిస్తామని పేర్కొన్నారు. 50 మంది ఉద్యోగులు డబ్బులను లెక్కించడంలో పాల్గొంటున్నారని తెలిపారు. త్వరలో డబ్బు లెక్కింపుకు చేరాలని మరింత మందిని ఆహ్వానించామని భారతీయ స్టేట్ బ్యాంక్ బోలంగీర్ రీజినల్ మేనేజర్ భగత్ బెహెరియా చెప్పారు.
Jeevan Reddy : రాజకీయాలకు అతీతంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
తమ వద్దకు 176 ప్యాకెట్ల డబ్బు సంచులు వచ్చాయని, అయితే తాము 40 ప్యాకెట్ల లెక్కింపును మాత్రమే పూర్తి చేశామని తెలిపారు. ఇప్పుడు మిగిలిన ప్యాకెట్లను లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. తాము ఇప్పటివరకు 40 కోట్ల రూపాయల డబ్బును లెక్కించామని వెల్లడించారు. కొంత డబ్బును టిట్లాగఢ్ వద్ద కూడా లెక్కించారని తెలిపారు. బ్యాంకు ప్రాంతాల్లో తగిన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు బెహెరియా పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఒడిశాకు చెందిన బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ జరిపిన సోదాల ద్వారా ఇప్పటివరకు సుమారు రూ. 225 కోట్ల వరకు లెక్కలో చూపని నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును లెక్కించేందుకు ఆదాయపు పన్ను శాఖ మూడు డజన్ల కౌంటింగ్ యంత్రాలను ఏర్పాటు చేసింది. యంత్రాలు పరిమిత సామర్థ్యంతో ఉన్నందున, కౌంటింగ్ నెమ్మదిగా సాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Vijayashanti : కేసీఆర్ హైదరాబాద్‌లో ఉండాల్సిన అవసరం ఏమిటి?: విజయశాంతి
ఒడిశా బోలంగీర్ జిల్లాలోని డిస్టిలరీ గ్రూప్ ప్రాంగణంలో అల్మీరాలలో దాచిన 200 కోట్ల రూపాయల నగదు, మిగిలిన మొత్తం ఒడిశాలోని సంబల్‌పూర్, సుందర్‌ఘర్, బొకారో, జార్ఖండ్‌లోని రాంచీలలో మరియు కోల్‌కతాలో లభించినట్లు అధికారులు తెలిపారు. భువనేశ్వర్ లోని పలాసపల్లిలో ఉన్న బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ కార్యాలయం, కొంతమంది కంపెనీ అధికారుల ఇళ్లు, బౌధ్‌లోని కంపెనీ ఫ్యాక్టరీ, కార్యాలయం, రాణిసతి రైస్‌మిల్‌లో కూడా ఆదాయపు పన్ను బృందం సోదాలు చేసింది.