Jeevan Reddy : రాజకీయాలకు అతీతంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

దశాబ్ద కాలంగా ఆరోగ్య శ్రీని కేసీఆర్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. నిరుపేదలకు ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య శ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు అందజేస్తామని తెలిపారు. 

Jeevan Reddy : రాజకీయాలకు అతీతంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

MLC Jeevan Reddy

MLC Jeevan Reddy : ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ కు రెండు సార్లు అధికారం అప్పగించినా స్వార్థ పూరిత రాజకీయాలతో ఉద్యమ ఆకాంక్షలు మరిచారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శిచారు. కేవలం 38 లక్షల రూపాయలతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టే అవకాశమున్నా రీడిజైనింగ్ పేరుతో ప్రజలపై లక్ష కోట్ల రూపాయల అప్పుల భారం మోపారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు. తుమ్మడిహెట్టీ నిర్మాణం చేపట్టల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ మేరకు జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల కల నెరవేర్చిన దేవత సోనియా గాంధీ అని కొనియాడారు. సోనియా గాంధీ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం మహిళలకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. దశాబ్ద కాలంగా ఆరోగ్య శ్రీని కేసీఆర్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. నిరుపేదలకు ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య శ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు అందజేస్తామని తెలిపారు.

Vijayashanti : కేసీఆర్ హైదరాబాద్‌లో ఉండాల్సిన అవసరం ఏమిటి?: విజయశాంతి

రాజకీయాలకు అతీతంగా ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తే ఉనికి కోల్పోతామని ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందరికీ అందిస్తామని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు. దశాబ్ద కాలంగా గృహ నిర్మాణం కనుమరుగు అయిందని తెలిపారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన 4000 గృహ నిర్మాణం ఇళ్లు కొనసాగించారని వెల్లడించారు.

ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. ఆటో యజమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. ప్రతి ఆటో యజమానికి ఏడాదికి 12,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపన్నులకు, అన్నార్తులకు అండగా నిలిచేలా అందరినీ కలిసి సమస్యలు వినడం ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సంకేతంగా పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు.