NEW YORK TIMES SQUARE వద్ద ఆధ్మాత్మిక వాతావరణం..శ్రీరాముడి చిత్రాలు

  • Publish Date - August 6, 2020 / 11:00 AM IST

అయోధ్యలో రామాలయ భూమి పూజతో ప్రజలు పులకంచిపోయారు. భారతదేశంతో పాటు..ఇతర దేశాల్లో ఉన్న ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి తన్మయత్వం చెందారు. ప్రఖ్యాత NEW YORK TIMES SQUARE పై శ్రీరామ చంద్రుని చిత్రం..అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామాలయ నమూనా 3 డీ చిత్రాలు ప్రత్యక్షం కావడంతో అమెరికాలో ఉన్న భారతీయులు సంతోషం వ్యక్తం చేశారు.



జై శ్రీరాం అనే నినదాలు మారుమ్రోగాయి. NEW YORK TIMES SQUARE భవనంపై ఉన్న ఓ పెద్ద బోర్డుపై ఈ చిత్రాలను ప్రదర్శించారు. ప్రపంచంలోనే అత్యంత భారీ బిల్ బోర్డుల్లో NEW YORK TIMES SQUARE పై ఏర్పాటు చేసిన బోర్డు కూడ ఒకటి.



దాదాపు 17 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
అయితే..అయోధ్యలో భూమి పూజ జరుగుతున్న సందర్భంలో NEW YORK TIMES SQUAREపై చిత్రాలు ప్రదర్శించాయనే ప్రచారం జరిగింది. ఇది జరిగిన కొద్దిసేపటికే..శ్రీరాముడి వీడియో ప్రత్యక్షం కావడంతో అందరూ సంతోషించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు