సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : అజ్మీర్‌ దర్గా అధినేత దీవాన్‌ జైనుల్‌ అబెదిన్‌

  • Publish Date - November 9, 2019 / 10:49 AM IST

అయోధ్య రామజన్మ భూమి-బాబ్రి మసీదు కేసులో సుప్రీంకోర్టు నేడు వెలువరించిన తీర్పును గౌరవిస్తున్నామని.. స్వాగతిస్తున్నామని అజ్మీర్‌ దర్గా ఆధ్మాత్మిక అధినేత దీవాన్‌ జైనుల్‌ అబెదిన్‌ అలీ ఖాన్‌ అన్నారు. అందరికంటే న్యాయవ్యవస్థ అత్యున్నతమైనదని, దాని నిర్ణయాన్ని ప్రతివారూ గౌరవించాలని అన్నారు. భారతదేశం వైపు చూస్తున్న ప్రపంచానికి మన ఐక్యతను చాటి చెప్పాల్సిన సమయం ఇది అని ఆయన అన్నారు. సుప్రీంతీర్పు న్యాయ వ్యవస్థ సమాజానికి ఎంత ముఖ్యమో తెలియజేసిందని అన్నారు. 

ఈ తీర్పులో భాగంగా..సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ రామ్ మందిని నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. మసీదు నిర్మించటానికి సున్నీ వక్ఫ్ బోర్టుకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని..ఆదేశించింది.