భర్త జీతం ఎంతో తెలుసుకునే హక్కు భార్యకు ఉంది : CIC

  • Publish Date - November 20, 2020 / 10:22 AM IST

jaipur wife has every right to know husband salary  : ఆడవాళ్ల వయస్సు..మగవారి జీతం అడక్కూడదని సామెత. ఇప్పుడది కుదరదు. భార్యాభర్తలిద్దరూ కలిసి కుటుంబం కోసం కష్టపడుతున్న రోజులివి. అటువంటిది వారిద్దరికి వచ్చే మొత్తం ఆదాయం (జీతం కూడా) ఎంతో ఒకరికొకరు తెలుసుకుంటేనే కదా దానికి తగినట్లుగా ఖర్చుపెట్టుకునేది. అటువంటిది భర్త జీతం భార్య అడక్కూడదు..నా జీతం ఎంతో నీకెందుకు మగవారి జీతం ఎంతో అడక్కూడదని తెలీదా? అనే భర్తలు ఉన్నారు. కానీ భర్తలూ..ఇకపై మీరు అలా అనకూడదు. భర్త జీతం ఎంతో తెలుసుకునే హక్కు భార్యకు ఉందని తేల్చి చెప్పింది కేంద్ర సమాచార కమిషన్.




https://10tv.in/pakistan-22-yr-old-man-with-3-wives-is-looking-for-a-4th-one-with-help-from-his-wives/
వివరాల్లోకి వెళితే..భర్త జీతభత్యాలెంతో తెలుసుకునే హక్కు భార్యకు ఉందని కేంద్ర సమాచార కమిషన్‌ స్పష్టం చేసింది. సమాచార హక్కు(ఆర్‌టీఐ) ద్వారా ఆమె ప్రశ్నిస్తే (అడిగితే) ఆదాయపు పన్ను విభాగం దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని సీఐసీ ఓ రూలింగ్‌లో తెలిపింది.


తన భర్త పూర్తి వేతన వివరాలు, టాక్సబుల్‌ ఆదాయం ఎంతో చెప్పాలంటూ రహమత్‌ బానో అనే మహిళ కోరినా జోధ్‌పూర్‌లోని ఇన్‌కంటాక్స్‌ శాఖ అందుకు నిరాకరించింది. భార్య అంటే థర్డ్‌పార్టీ కింద వస్తారన్న వాదనను ఆర్‌టీఐ తిరస్కరించింది.



ఏ భార్య అయినా సరే తన భర్త జీతం కానీ ఆదాయంకానీ ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కు సంబంధించిన వివరాలు అడిగినే తేదీ నుంచి 15 రోజుల్లో తెలపాలని కేంద్ర సమాచార కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.


కాగా జోథ్ పూర్ లోని ఇంన్ కంటాక్స్ శాఖ భార్య అభ్యర్థను తిరస్కరించిన విషయంపై ఆమె తరపు న్యాయవాది రాజక్ హైదర్ మాట్లాడుతూ..నా క్లైంట్ భర్త తన ఆదాయం గురించి తను కట్టే ట్యాక్స్ ల గురించి భార్యకు చెప్పటానికి ఆమె భర్త అంగీకరించలేదనీ సమాచారం చెప్పటానికి నిరాకరరించాడని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు