Jairam Ramesh: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ముగిశాయి.. మరి అదానీ స్కాం, కులగణన..: జైరాం రమేశ్

సామాన్యులు, చిరు వ్యాపారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటి గురించి పట్టించుకోకుండా వాటికి సంబంధించిన డేటాను వక్రీకరించే పనిలో

Jairam Ramesh

Jairam Ramesh – Adani: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన తీరుపై కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఆర్థిక నిర్వహణలో విఫలమైందని చెప్పారు.

దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందుకు దాన్ని మభ్యపెట్టేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిత్యావసరాల ధరలు పెరగడం, ఎంఎస్‌ఎంఈ కుదేలు అవుతుండడం, ఎఫ్‌డీఐలు తగ్గడం వంటి సమస్యలు ఉన్నాయని చెప్పారు.

సామాన్యులు, చిరు వ్యాపారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటి గురించి పట్టించుకోకుండా వాటికి సంబంధించిన డేటాను వక్రీకరించే పనిలో కేంద్ర సర్కారు బిజీగా ఉందని చెప్పారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ముగిశాయని ఆయన గుర్తు చేశారు.

అదానీ స్కాం, కులగణన, నిరుద్యోగం వంటి ముఖ్యమైన సమస్యల నుంచి దేశాన్ని దృష్టి మరల్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. మోదీ సర్కారు డేటాను ఎంతగా దాచాలని ప్రయత్నాలు జరిపినా లాభం లేదని చెప్పారు. దేశంలోని మెజారిటీ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

Canada: కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయం