Taliban (7)
All Party Meeting ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు, భారత ప్రజల తరలింపు,భారత పెట్టుబడులకు భద్రత,వాణిజ్యం,తాలిబన్ల పట్ల ప్రభుత్వ వైఖరి అంశాలపై కేంద్రప్రభుత్వం గురువారం పార్లమెంట్ బిల్డింగ్ లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. 37 పార్టీలకు చెందిన 31 మంది నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ తరపున లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు,వైసీపి తరపున లోక్ సభ పక్షనేత మిథున్ రెడ్డి, టీడీపి తరపున ఎంపీ గల్లా జయదేవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుమారు రెండున్నర గంటలపాటు సాగిన సమావేశంలో..అఫ్ఘానిస్తాన్ లో పరిస్థితుల పట్ల కేంద్రం వ్యవహరించాల్సిన తీరుపై కేంద్రానికి అఖిలపక్ష నేతలు సూచనలు చేశారు.
అఫ్గాన్‌లో పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయని..సాధ్యమైనంత మేరకు అప్ఘానిస్తాన్ నుంచి ప్రజలను తరలించేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు తెలిపినట్లు సమావేశం ముగిసిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రి నేతలకు తెలిపారు. అప్ఘానిస్తాన్ వదిలి వెళ్లేందుకు సాయం చేయండి అంటూ దాదాపు 15వేలమంది భారత ప్రభుత్వాన్ని కోరినట్లు జైశంకర్ చెప్పారు.
ఆ దేశంలోని భారతీయులను తరలించడానికే ప్రధమ ప్రాధాన్యత ఇచ్చామన్నారు. తరలింపు ప్రక్రియ యొత్తం సాధ్యమైనంత తర్వగా పూర్తిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. “ఆపరేషన్ దేవీ శక్తీ”పేరుతో అప్ఘానిస్తాన్ నుంచి పౌరుల తరలింపు కోసం ఆరు విమానాలు ఏర్పాటు చేయబడ్డాయని జైశంకర్ చెప్పారు. చాలావరకు భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చామని..అయితే ఇంకా కొందరు మిగిలిపోయారని..ప్రతిఒక్కరిని తీసుకొచ్చేందుకు ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
కొందరు అప్ఘానిస్తాన్ పౌరులను కూడా భారత్ కి తీసుకొచ్చినట్లు జైశంకర్ చెప్పారు. దీర్ఘకాలికంగా ఆఫ్ఘనిస్తానీలతో స్నేహ సంబంధాలను ఆశిస్తున్నట్లు మంత్రి జైశంకర్ తెలిపారు. ఇక,తాలిబన్ ల పట్ల భారత్ వైఖరిపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు..అప్ఘానిస్తాన్ లో పరిస్థితి ఇంకా సద్దుమనగలేదని..మొదట పరిస్థితిని సద్దుమణగనివ్వండి అని జైశంకర్ సమాధానమిచ్చారు. అఫ్ఘానిస్తాన్ ప్రజలతో భారత్ బలమైన స్నేహం అక్కడ ఉన్న 500 కి పైగా ప్రాజెక్టులలో ప్రతిబింబిస్తుందని. ఈ స్నేహం మాకు మార్గనిర్దేశం చేస్తుంది అని తెలిపారు.
కాగా,ఖతార్ రాజధాని దోహాలో జరిగిన శాంతి ఒప్పందంలో తాలిబన్లు తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని అఖిలపక్ష సమావేశంలో జైశంకర్ పేర్కొన్నారు. ఇక,ఈ సమావేశంలో షేర్ చేయబడిన ఓ డాక్యుమెంట్ ప్రకారం..175మంది ఎంబసీ సిబ్బందని,263 మంది ఇతర భారతీయులను,హిందువులు మరియు సిక్కులతో కలిపి 112మంది అప్ఘాన్ పౌరులను, 15మంది మూడు దేశాల పౌరులను కాబూల్ నుంచి ఢిల్లీకి తరలించింది భారత్.