Jamili Election Committee – First Meeting : జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలిన కమిటీ తొలి సమావేశం ముగిసింది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. శనివారం ఈ కమిటీ ఢిల్లీలో తొలిసారి సమావేశం అయింది.
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కమిటీ సభ్యులు చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, అమిత్ షా, అర్జున్ రామ్ మేఘ్వాల్ తో పాటు గులాం నబీ ఆజాద్ హాజరయ్యారు. జమిలి ఎన్నికలపై వాటాదారులు, రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు.
Telangana Elections : తెలంగాణలో జమిలి ఎన్నికలు లేనట్టే.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎలక్షన్స్!
ఏదైనా రాజకీయ పార్టీ కమిటీని కలిసి సూచనలు ఇవ్వవచ్చు అన్నారు. భారత ఎన్నికల సంఘం, న్యాయ కమిషన్ సహా ఇతర సంస్థల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు చర్చలు జరపాలని నిర్ణయించారు.